Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్ట్రాబెరీ మూన్.. జూన్ 21 గురువారంలో ఆకాశంలో కనువిందు..!

స్ట్రాబెరీ మూన్.. జూన్ 21 గురువారంలో ఆకాశంలో కనువిందు..!
, శుక్రవారం, 25 జూన్ 2021 (17:33 IST)
Strawberry Moon
గురువారం సూపర్ మూన్ కనువిందు చేయనుంది. వసంత కాలం చివర్లో, వేసవి కాలం ప్రారంభంలో కనిపించే నిండు పున్నమి జాబిలిని స్ట్రాబెరీ మూన్ అంటారు. ఇది గురువారం రాత్రి కనిపించింది. దీనిని చూసిన వారందరికీ సంతోషాన్ని పంచింది. 
 
ఉత్తరార్ధ గోళంలో ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హంగరీ, భారత దేశం, జపాన్, మెక్సికో, నెదర్లాండ్స్, నార్వే, పోలండ్, రొమేనియా, రష్యా, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, బ్రిటన్, ఉక్రెయిన్, అమెరికా ఉన్నాయి. ఈ దేశాల ప్రజలు స్ట్రాబెరీమూన్ సౌందర్యాన్ని ఆస్వాదించారు. 
 
సంవత్సరంలో సుదీర్ఘ పగటి సమయం జూన్ 21న ఉంటుంది. ఆ రోజే స్ట్రాబెరీమూన్ కనిపించింది. ఉత్తరార్ధ గోళంలో వేసవి కాలం సోమవారం నుంచి ప్రారంభమైంది. భారత దేశంలో స్ట్రాబెరీమూన్ గురువారం రాత్రి 12.10 గంటలకు అత్యంత స్పష్టంగా కనిపించింది.
 
ప్రాచీన అమెరికన్ తెగలవారు స్ట్రాబెరీల పంట కోత కాలం ఫుల్ మూన్‌తో ప్రారంభించేవారు. అందుకే దీనికి స్ట్రాబెరీమూన్ అని పేరు పెట్టారు. యూరోప్‌లో దీనిని రోజ్ మూన్ అంటారు. అక్కడ గులాబీల సేకరణ కాలం అప్పటి నుంచి ప్రారంభమవుతుంది. 
 
ఉత్తరార్ధ గోళంలో వేసవి ప్రారంభమవుతుంది కాబట్టి దీనిని హాట్ మూన్ అంటారు. వేసవి అయనం, స్ట్రాబెరీమూన్ ఒకేసారి రావడం సుమారు ఇరవయ్యేళ్ళకు ఒకసారి జరుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ అకౌంట్‌ బ్లాక్