Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నోట్ల రద్దు యజ్ఞం కాదు.. కార్చిచ్చు..! కాంగ్రెస్‌ నేత పృథ్వీరాజ్ చవాన్

దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన నోట్ల రద్దు యజ్ఞం కాదని... కార్చిచ్చు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్ విమర్శించారు. నూతన సంవత్సర సందేశం సందర్భంగా నోట్ల రద్దును ప్రధాని ఒక శుద్ధ

Advertiesment
Prithviraj chavan
, సోమవారం, 2 జనవరి 2017 (12:46 IST)
దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన నోట్ల రద్దు యజ్ఞం కాదని... కార్చిచ్చు అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పృథ్వీరాజ్‌ చవాన్ విమర్శించారు. నూతన సంవత్సర సందేశం సందర్భంగా నోట్ల రద్దును ప్రధాని ఒక శుద్ధి యజ్ఞంతో పోల్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ నిర్ణయం ఎంతోమంది జీవితాలకు, ఆర్థిక వ్యవస్థకు దావానంలా తాకిందన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన గర్భిణులకు సహాయం పథకం వాస్తవంగా యూపీఏ ప్రారంభించిన పథకమేనని ఆయన గుర్తు చేశారు. 
 
నోట్ల రద్దు తర్వాత దేశ వ్యాప్తంగా నల్లధనాన్ని వెలికితీశారో ఇంతవరకు ప్రకటించలేదన్నారు. దీనికితోడు ప్రజల అవసరాలకు సరిపడా రూ.500 నోట్లు విడుదల చేశారా? అని ఆయన నిలదీశారు. సహకార బ్యాంకులపై ఆంక్షలకు కారణాలు చెప్పలేదన్నారు. మోడీ నిర్ణయంతో పలువురు నల్లధనాన్ని చట్టబద్ధమైన సొమ్ముగా మార్చుకున్నారన్నారు. ఈ విషయంలో ప్రధాని అంచనాలు తల్లకిందులయ్యాయన్నారు. ప్రధాని మోడీ ప్రసంగంతో ఈ ఏడాది అత్యంత నిరాశాజనంకగా ప్రారంభమైందని ఆయన అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తారాస్థాయిలో ఎస్పీ సంక్షోభం... అత్యవసర సమావేశం రద్దు... సైకిల్‌ గుర్తు నాదేంటున్న ములాయం