Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్టాలిన్ సంచలనం.. కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం

స్టాలిన్ సంచలనం.. కొత్త వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం
, శనివారం, 28 ఆగస్టు 2021 (22:34 IST)
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. లోక్ సభ, రాజ్యసభలో ఈ బిల్లులకు తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ... బిల్లులను కేంద్రం ఆమోదింపజేసుకుంది. అనంతరం ఈ మూడు వ్యవసాయ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపడంతో అవి చట్టరూపం దాల్చాయి. ఈ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. 
 
తాజాగా తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 
 
రైతుల హక్కులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని, అందువల్ల ఈ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని స్టాలిన్ ఈ సందర్భంగా చెప్పారు. మరోవైపు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ధర్నాకు దిగారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పట్టపగలు అందరూ చూస్తుండగానే ఎంఐఎం కౌన్సిలర్ హత్య