Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'Dear' స్మృతి ఇరానీజీ అన్నందుకు మండిపడ్డ స్మృతి... వచ్చిన చిక్కల్లా అదే...

కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీని బీహార్ విద్యా శాఖామంత్రి ప్రియమైన అని సంబోధించడంపై స్మృతి ఇరానీ అభ్యంతరం తెలిపారు. తనను డియర్ అని సంబోధించడం పట్ల స్మృతి ఇరానీ... అశోక్‌జీ మహిళలను డియర్ అని సంబోధించడం ఎప్పటినుంచి మొదలెట్టారు? అని ప్రశ్నించ

Advertiesment
#Education Minister Ashok Choudhry
, గురువారం, 16 జూన్ 2016 (14:16 IST)
కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీని బీహార్ విద్యా శాఖామంత్రి ప్రియమైన అని సంబోధించడంపై స్మృతి ఇరానీ అభ్యంతరం తెలిపారు. తనను డియర్ అని సంబోధించడం పట్ల స్మృతి ఇరానీ... అశోక్‌జీ మహిళలను డియర్ అని సంబోధించడం ఎప్పటినుంచి మొదలెట్టారు? అని ప్రశ్నించారు. అశోక్ దీనికి వివరణ ఇస్తూ... మిమ్మల్ని అగౌరపరచాలని కాదు కానీ నేర్పుతున్నాను అంటూ పేర్కొంటూనే అధికారిక లేఖలు డియర్ అన్న పదంతో ప్రారంభమవుతాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక అక్కడి నుంచి ఈ ఇద్దరు మంత్రుల మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం సాగిపోయింది. 
 
మరో విషయం ఏమిటంటే... ఇప్పుడు స్మృతి ఇరానీకి( డియర్ అనకూడదు) మద్దతు తెలిపేవాళ్లు, బీహార్ మంత్రి( డియర్ అనవచ్చు)కి మద్దతు తెలిపే వాళ్లు ట్విట్టర్లో పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. నిజానికి లేఖల్లో చాలామంది డియర్ అని సంబోధిస్తూ రాయడం మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఐతే ఆ పదాన్ని ఇష్టపడని మహిళలలు తిరుగు పోస్టులో... హలో మిస్టర్... అంటూ సంబోధిస్తారు. వారు డియర్ అనే పదాన్ని ఇష్టపడటం లేదని ఆ సంబోధనతోనే అర్థమయిపోతుంది. 
 
కాబట్టి దాన్ని వదిలేసి హలో అంటూ లేఖలు సాగిస్తుంటారు. అసలు చిక్కంతా ఎక్కడంటే... ఆంగ్ల భాషలో డియర్ అంటూ వాడకం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఐతే మన భారతీయ భాషల్లో హోదా, స్త్రీ, పురుషుడు, అధికారి... ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా సంబోధించడం ఉంది. కాబట్టి ఆ భాషలు తెలిపే గౌరవసూచకాలను వాడుకుంటూ ముందుకు వెళితే బావుంటుంది కదూ. మన తెలుగులో అయితే పూజ్యులు, గౌరవనీయులు, మహారాజశ్రీ.. ఇలాగన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నియోజకవర్గ అభివృద్థి కోసం తెదేపాలో చేరుతున్నా : అమర్నాథ్ రెడ్డి