Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నువ్వెంత, నీ విమానమెంత? నీ తాతలాటి రైలుంది పో అన్న ఎంపీ

దేశంలోని అన్ని విమానయాన సంస్థలూ కట్టగట్టుకుని నిషేధం ప్రకటించిన నేపథ్యంలో గత మూడు వారాలుగా విమాన ప్రయాణాల చాన్సు కోల్పోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తనలాంటి సామాన్యులకు విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాల్లే బాగుంటాయని చెప్పేశారు.

నువ్వెంత, నీ విమానమెంత? నీ తాతలాటి రైలుంది పో అన్న ఎంపీ
హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (04:33 IST)
దేశంలోని అన్ని విమానయాన సంస్థలూ కట్టగట్టుకుని నిషేధం ప్రకటించిన నేపథ్యంలో గత మూడు వారాలుగా విమాన ప్రయాణాల చాన్సు కోల్పోయిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తనలాంటి సామాన్యులకు విమాన ప్రయాణాల కంటే రైలు ప్రయాణాల్లే బాగుంటాయని చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎంపీపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ ఇంకా బింకం వదలని ఎంపీ విమానంలో టికెట్ బుక్ చేసుకుని కూడా మనసు మార్చుకుని రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ వెళ్లారు. తాను సామాన్య పౌరుడిని కాబట్టి బుధవారం కూడా రైల్లోనే ముంబై వెళతానని చెప్పారు.
 
 
బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో గత మార్చి 23న ఎయిరిండియా సీనియర్‌ ఉద్యోగిని గైక్వాడ్‌ పలుమార్లు చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఎయిర్‌లైన్‌ ఆయనపై నిషేధం విధించింది. అయితే ఆ సందర్భంలో తాను చాలా శాంతియుతంగా వ్యవహరించానని, కానీ ఎయిరిండియా సిబ్బందే తనతో దురుసుగా ప్రవర్తించారని ఇటీవల గైక్వాడ్‌ లోక్‌సభలో చెప్పుకొచ్చారు. 
 
పార్లమెంట్‌ సభ్యుడు, వీవీఐపీ అన్న గౌరవం లేకుండా తనతో అమర్యాదకరంగా మాట్లాడినందుకే కొట్టానని చెప్పారు. కేంద్రం, శివసేన ఎంపీల వాదోపవాదాల అనంతరం గత శుక్రవారం గైక్వాడ్‌పై ఎయిరిండియా నిషేధం ఎత్తివేసింది. అయితే ఘటన సమయంలో తాను వీవీఐపీని అని చెప్పుకున్న గైక్వాడ్‌.. ఇప్పుడు సామాన్య పౌరుడిని అని చెప్పి విమాన ప్రయాణాలకు దూరంగా ఉండటం గమనార్హం.
 
ఎంపీ చెప్పినదాని ప్రకారం విమాన యాన సంస్థలే కాదు.. ప్రభుత్వరంగ సంస్థలు కూడా కస్టమర్లతో వ్యవహరించే టప్పుడు నిర్లక్ష్యం, అధికార దర్పం ప్రదర్శించడం నిజమే కావచ్చు. కాని అధికారిక స్థానంలో ప్రజాప్రతినిధిగా ఉండి సిబ్బందిపై అలా చేయి చేసుకుంటే వీవీఐపీకి, సామాన్యులకు ఇక తేడా ఏమిటన్నది ఆ ఎంపీ దృష్టికి రాకపోవడే విచారకరం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తినే దానికంటే ఎక్కువ వడ్డిస్తే వదిలేయమా? మోదీకి కొత్త పాఠం