Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం సిద్ధరామయ్య.. 'ఓ తలతిక్క మనిషి'.. బీఎస్ యడ్యూరప్ప ఫైర్

సీఎం సిద్ధరామయ్య.. 'ఓ తలతిక్క మనిషి'.. బీఎస్ యడ్యూరప్ప ఫైర్
, మంగళవారం, 24 మే 2016 (18:18 IST)
భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ తలతిక్క మనిషిగా అభివర్ణించారు. 
 
ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. తనకు గిట్టనివారు కుట్రపన్ని జైలుకు పంపారని అవి తప్పుడు కేసులుగా కోర్టు నిర్ధారించిందన్నారు. ఆ విషయాలు సీఎం సిద్దరామయ్యకు తెలిసినా తరచూ తాను జైలుకెళ్ళానని విమర్శించడం సబబు కాదన్నారు. 
 
ముఖ్యంగా.. సిద్ధరామయ్యకు వాస్తవాలు తెలిసినా అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం సిద్దరామయ్య కాంగ్రెస్‌ పార్టీకి చివరి ముఖ్యమంత్రి అని బీఎస్ జోస్యం చెప్పారు. చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం రాష్ట్ర ప్రజలు చెబుతారని యడ్యూరప్ప వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దావూద్ ఇబ్రహీంను పట్టుకుని తీరుతాం : రాజ్‌నాథ్ సింగ్