Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'నడిచే దేవుడు' అంత్యక్రియలు పూర్తి...

Advertiesment
Shivakumara Swami
, మంగళవారం, 22 జనవరి 2019 (17:42 IST)
ఓ శఖం ముగిసింది. ఆధ్యాత్మిక శిఖరం నింగికేగసింది. తుముకూరు సిద్ధగంగా మఠాధిపతి శివ కుమార స్వామిజీ అంత్యక్రియలు భక్తుల అశ్రునయనాల మద్య ముగిశాయి. లింగాయత్ వీరశైవులు తమ ఆరాధ్య దైవంగా పూజించే శివకుమార స్వామి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కర్ణాటకలో విషాద ఛాయలు అలమకున్నాయి. 
 
లక్షలాది మంది స్వామిజీ భక్తులు కడచూపు కోసం తరలి వచ్చారు. భక్తుల విశ్వాసాన్ని సంపాదించకున్న స్వామీజీ ఇక లేరనే మరణవార్తతో భక్తులు శోక సంద్రంలో మునిగిపోయారు. నడిచే దేవుడిగా ప్రసిద్ధిగాంచిన శివకుమారస్వామిజీ అనేక దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. 
 
శ్రీ సిద్ధగంగా ఎడ్యూకేషన్‌ సొసైటీ పేరిట 125 విద్యాసంస్థలను నెలకొల్పి పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 2015లో స్వామిజీకి పద్మభూషణ్‌ అవార్డును అందజేసింది. మఠంలో సిద్దం చేసిన సమాధి వద్ద భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ సందర్బంగా స్వామీజీని కడసారి చూపు కోసం ఉంచిన అనంతరం అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై ఫైనాన్షియల్ ఇయర్.. జనవరి టు డిసెంబరు