Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉద్ధవ్ ఠాక్రేకు షాకిచ్చిన ఎన్నికల సంఘం.. సీఎం షిండేదే నిజమైన శివసేన

shivsena
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2023 (22:22 IST)
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎన్నికల సంఘం తేరుకోలేని షాకిచ్చింది. నిజమైన శివసేన పార్టీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేదే అని శుక్రవారం స్పష్టం చేసింది. పైపెచ్చు.. శివసేన ఎన్నికల గుర్తు అయిన ధనస్సు, బాణం గుర్తును సీఎం షిండేకే కేటాయించింది. 
 
శివసేన పార్టీలో సంక్షోభం ఏర్పడి అసమ్మతి వర్గం నేత ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక అసలైన శివసేన పార్టీ తమదే అంటూ షిండే, ఉద్ధవ్ ఠాక్రే వర్గాలు ప్రకటించుకున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేంత వరకు ఇరు వర్గాలకు వేర్వేరు గుర్తులు కేటాయించింది.
 
ఈ నేపథ్యంలో తాజాగా ఈసీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. నిజమైన శివనసేన పార్టీ సీఎం షిండేదే అని, ఆ పార్టీకి చెందిన ఎన్నికల గుర్తు అయిన ధనస్సు బాణం గుర్తును కూడా ఆయనకే చెల్లుతుందని వెల్లడించింది. దీనిపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే హర్షం వ్యక్తం చేశారు. ఇది శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే భావజాలం సాధించిన విజయం అంటూ ప్రకటించారు. 
 
మరోవైపు, ఎన్నికల సంఘం నిర్ణయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ఈసీ నిర్ణయాన్ని తాము ముందుగానే ఊహించినదని చెప్పారు. ఈ విషయంలో తాము బాధపడటం లేదని, ప్రజలు తమ వెంటే ఉన్నారని, శివసేన ఎవరిదో ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఆయన ప్రకటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ పుట్టినరోజు... ఎన్నారై 1400 అడుగుల ఎత్తు నుంచి ఏం చేశాడంటే? (video)