Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సారీ చెప్పను.. దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోమన్న శివసేన ఎంపీ : రిటర్న్ టిక్కెట్ రద్దు చేసిన ఎయిరిండియా

తాటాకు చప్పుళ్ళకు భయపడే వ్యక్తిని కాదు.. దమ్ముంటే అరెస్టు చేసుకోండి. చేతగాడివాడిలా కూర్చోవడానికి నేను బీజేపీ ఎంపీని కాదు.. శివసేన ఎంపీని అంటూ ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంప

సారీ చెప్పను.. దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోమన్న శివసేన ఎంపీ : రిటర్న్ టిక్కెట్ రద్దు చేసిన ఎయిరిండియా
, శుక్రవారం, 24 మార్చి 2017 (14:56 IST)
తాటాకు చప్పుళ్ళకు భయపడే వ్యక్తిని కాదు.. దమ్ముంటే అరెస్టు చేసుకోండి. చేతగాడివాడిలా కూర్చోవడానికి నేను బీజేపీ ఎంపీని కాదు.. శివసేన ఎంపీని అంటూ ఎయిర్ ఇండియా సీనియర్ ఉద్యోగిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ మరింతగా రెచ్చిపోయి మాట్లాడారు. పైగా... ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టడంలో ఎలాంటి తప్పులేదని పేర్కొంటూ.. తన చర్యను సమర్థించుకున్నారు. 
 
బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ ఇవ్వలేదన్న కోపంతో ఎయిరిండియా సీనియర్‌ మేనేజర్‌ శివకుమార్‌ను రవీంద్ర గైక్వాడ్‌ గురువారం చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన గైక్వాడ్‌.. ‘నేను క్షమాపణ చెప్పేది లేదు. అతడే నాకు క్షమాపణ చెప్పి తీరాలి. ఎంపీలతో ఎలా ప్రవర్తించాలో 60 ఏళ్ల వ్యక్తికి తెలిసి ఉండాలి. ఈ విషయంలో పోలీసులకు దమ్ముంటే నన్ను అరెస్ట్‌ చేయండి. నా పార్టీ నాకు అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. 
 
ఇదిలావుండగా, సిబ్బందిని చెప్పుతో కొట్టిన ఘటనతో గైక్వాడ్ పేరును భారతీయ విమాన సంస్థల సమాఖ్య (ఎఫ్.ఐ.ఏ) నిషేధిత జాబితాలో ఉంచింది. ఈ విషయాన్ని ఖరారు చేసిన వెంటనే గైక్వాడ్ రిటర్న్ టిక్కెట్‌ను ఎయిరిండియా రద్దు చేసింది. అలాగే, ఇతర విమానయాన సంస్థలు కూడా ఆయనకు విమాన టిక్కెట్ ఇచ్చే వీలులేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయన రైలు లేదా బస్సు లేదా, కారులో తన గమ్యస్థానానికి చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనాడు కన్నీళ్లు పెట్టుకున్న ఆదిత్యనాథ్... ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌‌లో వీర దూకుడు... ఎందుకు?