Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉంటారో.. పోతారో తేల్చుకోండి.. శివసేనకు సీఎం ఫడ్నవిస్ వార్నింగ్

మిత్రపక్షమైన శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిత్రపక్షంగా ఉంటారో పోతారో తేల్చుకోవాలంటూ ఘాటైన హెచ్చరిక పంపారు.

ఉంటారో.. పోతారో తేల్చుకోండి.. శివసేనకు సీఎం ఫడ్నవిస్ వార్నింగ్
, ఆదివారం, 29 అక్టోబరు 2017 (11:31 IST)
మిత్రపక్షమైన శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిత్రపక్షంగా ఉంటారో పోతారో తేల్చుకోవాలంటూ ఘాటైన హెచ్చరిక పంపారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రధాని మోడీ పని అయిపోయిందంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కనిపిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారాయి. 
 
పైగా, ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతారా? లేదా? అన్నది తేల్చుకోవాలని శివసేనకు సవాల్‌ విసిరారు. గతంలో 100మంది రాహుల్‌గాంధీలు కూడా మోడీని ఏమీ చేయలేరని రెండేళ్ల క్రితం పొగడ్తలతో ముంచెత్తిన శివసేన ఇపుడు మాట మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాము చేసే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తూనే ఉంది... కానీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం సరికాదన్నారు. మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. ఇటీవల శివసేన - ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్‌ చేస్తూ చురకలు అంటిస్తోంది. సంజయ్‌ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలిగితే ఫడ్నవిస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. శరద్‌ పవార్‌ మద్దతుపైనే బీజేపీ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయ స్నేహితురాలి శశికళ బినామీ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం