Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

యూపీలో ప్రజలంతా ఒక్కటే... షియా, సున్నీ వక్ఫ్ బోర్డులు రద్దు : సీఎం ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని పేర్కొంటూ... యూపీలో ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద

Advertiesment
Shia
, శుక్రవారం, 16 జూన్ 2017 (10:41 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని పేర్కొంటూ... యూపీలో ముస్లింల సంక్షేమం కోసం నిర్వహిస్తున్న షియా, సున్ని వక్ఫ్ బోర్డులు రద్దు చేయాలని ఆదేశాలు జారీచేశారు.
 
షియా వక్ఫ్ బోర్డ్ అధ్యక్షుడు వసీం రిజ్వీ, సమాజ్‌ వాదీ పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ మంత్రిగా వ్యవహరించిన అజామ్ ఖాన్‌ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారు పాల్పడిన అవకతవకలపై వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ చేపట్టింది. 
 
ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సున్నీ, షియా వక్ఫ్ బోర్డు రద్దు చేయాలంటూ వక్ఫ్ మంత్రి మొషిన్ రాజాను ఆదేశించారు. చట్టపరమైన అన్ని విషయాలు పరిశీలించిన అనంతరం సున్నీ, షియాల వక్ఫ్ బోర్డును రద్దు చేస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో వక్ఫ్ బోర్డు రద్దు, ఇతర విషయాలపై న్యాయ, చట్టపరమైన అంశాలపై అధ్యయనం జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్నేహితుడితో కలిసి పక్క పంచుకోమన్నాడు.. కుదరదనేసరికి భార్యపై, ఫ్రెండ్‌తో కలిసి?