Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షీనా కేసులో పీటర్‌కు సంబంధం లేదు.. ఇంద్రాణీనే కారణం: ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ

దేశంలో కలకలం సృష్టించిన షీనాబోరా మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో షీనాబోరాను పీకనులిమి చంపేసిందని

Advertiesment
Sheena Bora Murder
, శనివారం, 28 జనవరి 2017 (13:53 IST)
దేశంలో కలకలం సృష్టించిన షీనాబోరా మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. 2012 ఏప్రిల్ నెలలో షీనాను కారులో ముంబై శివార్లకు తీసుకెళ్లిన ఇంద్రాణి.. తన మాజీ భర్త, డ్రైవర్ల సహాయంతో షీనాబోరాను పీకనులిమి చంపేసిందని ఆరోపణలున్నాయి. సగం కాలిన స్థితిలో ఉన్న షీనాబోరా మృతదేహం 2015 సంవత్సరంలో ముంబై సమీపంలోని అడవుల్లో దొరికింది. అదే సంవత్సరం ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టుచేశారు. 
 
షీనా హత్యకు గురైన ఐదేళ్ల తర్వాత ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, సవతి తండ్రి పీటర్ ముఖర్జియాలపై సీబీఐ హత్య, నేరపూరిత కుట్ర అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీటు కూడా దాఖలైంది. చార్జిషీటుపై పసీబీఐ ఫిబ్రవరి 1 నుంచి ప్రత్యేక కోర్టులో విచారణ కూడా మొదలుకానుంది.
 
ఈ నేపథ్యంలో రాహుల్‌ ముఖర్జియా తండ్రి పీటర్‌ ముఖర్జియాకు మద్దతు పలికాడు. ఆయన నిర్దోషి అని, ఆయనకు షీనా హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. తన కూతురైన షీనాకు, సవతి కొడుకైన రాహుల్‌ మధ్య అనుబంధం ఉండటం.. అది తనకు గిట్టకపోవడం వల్లే ఆమెను ఇంద్రాణి ముఖర్జియా హత్య చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జల్లికట్టులా ట్రిపుల్ తలాక్‌పై ఉద్యమిద్దాం.. పెళ్ళిళ్లు చేసుకుందాం.. విడాకులు ఇచ్చుకుందాం..