Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...

ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగానే ఇంట్లోనే పాతి పెట్టి పాలరాతితో సమాధి చేసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల

Advertiesment
ఫేస్ బుక్ పరిచయం... ప్రియుడికోసం లేచి వచ్చేసింది... పెళ్లితో ఆ సుఖం తీర్చుకుని పాతేశాడు...
, శనివారం, 4 ఫిబ్రవరి 2017 (14:00 IST)
ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మి వచ్చిన మహిళను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆపై ఏమీ తెలియనట్లుగానే ఇంట్లోనే పాతి పెట్టి పాలరాతితో సమాధి చేసేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌కు చెందిన ఆకాంక్షా శర్మకు భోపాల్ వాసి ఉదయన్ దాస్‌తో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అతని కోసం భోపాల్ వచ్చి స్థిరపడేందుకు ఆకాంక్ష నిర్ణయించుకుంది. 
 
ఇంట్లో అమెరికా వెళ్తున్నానని చెప్పింది. కుటుంబ సభ్యులు కూడా నమ్మారు. డిసెంబర్ వరకు తరచుగా కుటుంబ సభ్యులకు ఫోన్లు వచ్చేవి. ఆ తర్వాత ఫోన్లు ఆగిపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హత్యోదంతాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేసి 3 గంటల పాటు ఇంటరాగేషన్ చేస్తే కానీ అసలు విషయం బయటకు రాలేదు. ఈ కేసుపై దర్యాప్తును కొనసాగిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన హెర్నియా ఆపరేషన్.. పురుషుని కడుపులో స్త్రీ జననాంగాలు, గర్భసంచి..!