Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కెమిస్ట్రీ మెరుపుల్లా.. ఫిజిక్స్ వేడికి చోటులేకుండా జీవితం బయాలజీలా ఉండాలి...

Advertiesment
కెమిస్ట్రీ మెరుపుల్లా.. ఫిజిక్స్ వేడికి చోటులేకుండా జీవితం బయాలజీలా ఉండాలి...
, శుక్రవారం, 14 డిశెంబరు 2018 (12:21 IST)
తిరువనంతపురానికి చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్ ముద్రించిన వెడ్డింగ్ కార్డు ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లి పత్రికను చూసిన కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ వెడ్డింగ్ కార్డు కెమిస్ట్రీ ఫార్ములాను పోలివుండేలా డిజైన్ చేయడం ప్రతి ఒక్కరినీ అకర్షిస్తోంది. 
 
నిజానికి పెళ్లి అనేది ప్రతి వ్యక్తి జీవితంలో మరుపురానిది. ఇందులో హంగులకు ఆర్భాటాలకు ఏమాత్రం కొదువే ఉండదు. జీవితంలో ఒక్కసారి జరిగే ఈ వేడుకను.. కన్నుల పండుగగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు.
 
అలాగే, కేరళకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్ కూడా నిర్ణయించుకుంది. ఇందుకోసం తన వెడ్డింగ్ కార్డును కెమిస్ట్రీ ఫార్ములాను పోలి ఉండేలా డిజైన్ చేయించింది. వివాహ పత్రిక ఓపెన్ చేయగానే ఎడమ వైపు "లవ్" అనే ఇంగ్లీష్ అక్షరాలతో డిజైన్ చేయగా.. కుడివైపు పర్ఫెక్ట్ కెమిస్ట్రీ అని వధువరుల పేర్లు వేయించారు. ఈ పత్రికను వధువు ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి పత్రిక వైరల్ అయింది. 
 
కాగా, శుభలేఖను చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ సరదాగా స్పందించారు. నవదంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. "ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మెరుపుల్లా వెదజల్లాలని, ఫిజిక్స్‌లో ఉండే వేడికి చోటివ్వకుండా, మీ జీవితంలో కాంతి మెరవాలని, దాని ఫలితం బయాలజీలా ఉండాలి" అంటూ ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేసీఆర్ విజయంపై భూమా అఖిలప్రియ ట్వీట్స్... తెదేపాలో కలకలం