Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరెంటు చోరీలను అడ్డుకోవడానికి ప్రత్యేక ఠాణాలు

కరెంటు చోరీలను అడ్డుకోవడానికి ప్రత్యేక ఠాణాలు
, మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (08:20 IST)
కరెంట్‌‌ డిస్ట్రిబ్యూషన్‌‌ కంపెనీల (డిస్కమ్‌‌) ఆర్థిక సమస్యలు తీర్చడానికి మోడీ ప్రభుత్వం కొత్త టారిఫ్ పాలసీని, ఉదయ్‌‌ 2.0 పథకాన్నీ అమలు చేయనుంది. వీటివల్ల డిస్కమ్‌‌ల నష్టాలు తగ్గుతాయని, నిరంతరం కరెంటు సరఫరా అవుతుందని కేంద్ర విద్యుత్‌‌శాఖ మంత్రి ఆర్కే సింగ్‌‌ చెప్పారు.

పీఆర్‌‌ఏఏపీటీఐ లెక్కల ప్రకారం డిస్కమ్‌‌లు జూలై వరకు జెన్‌‌కో (కరెంటు తయారీ కంపెనీలు)లకు రూ.73,425 కోట్లు చెల్లించాలి. వీటిలో రూ.55,276 కోట్ల ఓవర్‌‌డ్యూ కూడా ఉంది. 60 రోజుల్లోపు బకాయిలు చెల్లించకుంటే జెన్‌‌కోలు  వాటిని ఓవర్‌‌డ్యూగా పిలుస్తాయి. వడ్డీ కూడా వేస్తాయి.

‘‘రోజంతా కరెంటు సరఫరా చేయడానికి తగినంత విద్యుత్‌‌ అందుబాటులో ఉంది.  దానిని కొనడానికి రాష్ట్రాల డిస్కమ్​ల  దగ్గర డబ్బు లేదు. ఇక నుంచి ఇవి జెన్‌‌కోల నుంచి కరెంటు కొనుగోలు చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లెటర్‌‌ ఆఫ్ క్రెడిట్లు తీసుకోవడాన్ని తప్పనిసరి చేశారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వాల ప్లాంట్ల నుంచి కొనే కరెంటుకు ఈ రూల్‌‌ వర్తించదు. ఆగస్టు నుంచే ఈ కొత్త రూల్స్‌‌ అమల్లోకి వచ్చాయి. వీటి వల్ల కరెంటు ఉత్పత్తి కంపెనీలు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతాయి’’ అని వివరించారు.
 
త్వరలో ఉదయ్‌‌…
కొత్త కరెంటు టారిఫ్ పాలసీకి ఆమోదం కోసం ఇది వరకే దానిని కేబినెట్‌‌ పరిశీలనకు పంపించామని మంత్రి వెల్లడించారు. డిస్కమ్‌‌లకు మేలు చేయడానికి ఉదయ్‌‌ 2.0ను ఈ ఆర్థిక సంవత్సరంలోనే తమ శాఖ ప్రారంభిస్తుందని ఆర్కే సింగ్‌‌ వెల్లడించారు.

కొత్త టారిఫ్‌‌ విధానం ప్రకారం చెల్లింపు ఆలస్యమైనందుకు డిస్కమ్‌‌లు సర్‌‌చార్జ్‌‌ కట్టాలి. ఇది వడ్డీ రేటుకు సమానంగా ఉంటుంది. నష్టాలను తగ్గించుకోకుంటే ప్రభుత్వం గ్రాంట్లను గానీ, లోన్లను గానీ ఇవ్వదు. కొత్త విధానంలో కస్టమర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, లోడ్‌‌ షెడ్డింగ్‌‌ చేస్తే డిస్కమ్‌‌లకు జరిమానా విధిస్తామని సింగ్‌‌ అన్నారు.

కొత్త మీటరు, ట్రాన్స్‌‌ఫార్మర్‌‌ బిగించడానికి డిస్కమ్‌‌లకు నిర్దిష్ట గడువు విధిస్తామని చెప్పారు. గడువు మించితే జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు.
 
ఇది వరకు అండ్‌‌–రికవర్డ్‌‌ పవర్‌‌ సప్లై ఖర్చులను కస్టమర్ల నుంచి వసూలు చేసేవారని, ఈ పద్ధతిని రద్దు చేస్తామని చెప్పారు. ఈ నష్టం 15 శాతం మించితే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా డిస్కమ్‌‌ భరించాల్సి ఉంటుందని సింగ్‌‌ అన్నారు.

‘‘ఉదయ్‌‌ 2.0లో భాగంగా డిస్కమ్‌‌లు లాస్‌‌లను తగ్గించుకోవడానికి నిధులు ఇస్తాం. కరెంటు చోరీలను అడ్డుకోవడానికి ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. నష్టాలు తగ్గించుకునే డిస్కమ్‌‌లకు మాత్రమే నిధులు అందిస్తాం. నష్టాల్లో ఉన్న కంపెనీలకు పీఎఫ్‌‌సీలు, ఆర్‌‌ఈసీలు కూడా లోన్లు ఇవ్వవు’’ అని స్పష్టం చేశారు.

డిస్కమ్‌‌ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి 2015 నుంచి ఉజ్వల్‌‌ డిస్కమ్‌‌ అష్యూరెన్స్‌‌ యోజన (ఉదయ్‌‌)ను అమలు చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ మాట్లాడుతూ ‘‘డిస్కమ్‌‌లను ఆర్థికంగా బలోపేతం చేయడం, నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఉదయ్‌‌ను అమలుచేస్తోంది.  దీనిని మరింత మెరుగుపరుస్తాం.

కొన్ని కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్నాం. డిమాండ్‌‌ ఉంటే పవర్‌‌ సెక్టార్‌‌కు ఇన్వెస్ట్‌‌మెంట్లు రావడం సులువు అవుతుంది. అదే పవర్‌‌ పర్చేజింగ్‌‌ అగ్రిమెంటుగా మారుతుంది. సరఫరా చేసిన కరెంటును డిస్కమ్‌‌లు నిర్దిష్ట సమయంలో డబ్బు చెల్లిస్తాయనే నమ్మకం ఉంటేనే ఇన్వెస్టర్లు ఈ రంగంలోకి వస్తారు” అని ఆమె అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్లిప్పర్లు వేసుకుంటే వెయ్యి, లుంగి కడితే రూ.2 వేలు ఫైన్