Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గంగానదిలో స్నానానికెళ్లారు.. సెల్ఫీ తీసుకున్నారు.. ప్రాణాలు కోల్పోయారు..!

సెల్ఫీ సరదా ఏమో కానీ.. దాని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలిసిందే. కొంతమంది మత్యువు దరిదాపులోకి వెళ్లి బయటపడిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా కానీ కొంతమందికి ఈ సెల్ఫీ పిచ్చి వ

Advertiesment
Selfie
, శుక్రవారం, 24 జూన్ 2016 (11:32 IST)
సెల్ఫీ సరదా ఏమో కానీ.. దాని వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలిసిందే. కొంతమంది మత్యువు దరిదాపులోకి వెళ్లి బయటపడిన సందర్భాలు కూడా లేకపోలేదు. అయినా కానీ కొంతమందికి ఈ సెల్ఫీ పిచ్చి వదలడం లేదు. కొంతమందికైతే ఇదో అంటువ్యాధిలా మారింది. ఏం చేసినా వెంటనే సెల్ఫీ తీసేసుకోవడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. వచ్చిన లైక్‌లు చూసి సంబరపడిపోవడం... వీటితోనే సగం జీవితం గడిచిపోతుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గంగానదిలో స్నానానికి వెళ్లిన యువకులు సెల్ఫీ కారణంగా ఒకరు కాదు ఏకంగా ఏడుగురి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయింది. 
 
కాన్పూర్‌లోని కొలొనేల్‌గంజ్‌కు చెందిన శివం అనే యువకుడు సెల్ఫీ తీసుకుంటూ నీళ్లలో పడిపోయాడు. దీంతో అతడిని కాపాడడానికి ప్రయత్నించిన ఆరుగురు మిత్రులు కూడా నదిలో పడిపోయారు. అతన్ని కాపాడేందుకు మరో మిత్రుడు, ఇలా ఒకరినొకరు కాపాడే ప్రయత్నంలో వీరంతా నీటిలో కొట్టుకుపోయినట్టు పోలీసులు తెలిపారు. భారీవర్షం కారణంగా నీటిమట్టం పెరగడం, ప్రవాహ ఉధృతి అధికంగా ఉండటంతో అందరూ నీటిలో కొట్టుకుపోయుంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈతగాళ్ల ద్వారా వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 
 
2 గంటలు తీవ్ర శ్రమపడి గాలించిన తరువాత వారి మృతదేహాలు లభించాయి. ఈ ఘ‌ట‌న‌తో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా యంత్రాంగం నది వద్ద బారికేడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించింది. ఘటన జరిగిన చోట పోలీసులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరైనా బారికేడ్లు దాటి నది లోపలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారంతా 20 ఏళ్ల విద్యార్థులేనని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. మృతులను శివం గుప్తా, సచిన్ గుప్తా, సత్యం గుప్తా, సందీప్ గుప్తా, గోలు తివారి, రోహిత్, మహ్మద్ సదబ్‌గా గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్లు ఆ విషయంలో మరీ వీక్ అట.. అవి లేకుంటే అస్సలుండలేరట!