Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెహ్వాగ్ చిన్నతనం నుంచి మీ ఆటను చూస్తున్నా.. ఇలా గుండెను బద్దలు చేస్తావా: కౌర్

ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపిన కౌర్.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌పై స్పందించింది. తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ తన గుండెను బద్దలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో గుర్‌మెహర్ చెప్పింది. సెహ్వాగ

Advertiesment
సెహ్వాగ్ చిన్నతనం నుంచి మీ ఆటను చూస్తున్నా.. ఇలా గుండెను బద్దలు చేస్తావా: కౌర్
హైదరాబాద్ , బుధవారం, 1 మార్చి 2017 (03:52 IST)
ఏబీవీపీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చర్చకు తెరలేపిన కౌర్.. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్‌పై స్పందించింది. తనను ఉద్దేశిస్తూ సెహ్వాగ్ చేసిన ట్వీట్ తన గుండెను బద్దలు చేసిందని ఓ ఇంటర్వ్యూలో గుర్‌మెహర్ చెప్పింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్ చూడగానే తనకు చాలా బాధ కలిగిందని, తన చిన్నతనం నుంచి ఆయనను చూస్తున్నానని, తనను ఉద్దేశిస్తూ ఎందుకు ఇలా ట్వీట్ చేశాడోనని ఆవేదన వ్యక్తం చేసింది.


గుర్‌మెహర్‌ తండ్రి కెప్టెన్ మణ్‌దీప్ సింగ్ 1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందారు. గుర్‌మెహర్ ఇటీవల.. తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానంగా సెహ్వాగ్ అదే తరహాలో ట్వీట్ చేశాడు. 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. 
 
వీరూ ఈ ట్వీట్ చేయగానే చాలా మంది నెటిజెన్లు స్పందించారు. కొందరు వీరూను సమర్థించగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్‌మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గుర్‌మెహర్‌ సోషల్ మీడియాలో నిత్యం పోస్ట్‌లు చేస్తోంది. తనను రేప్ చేస్తామని ఏబీవీపీ కార్యకర్తలు బెదిరించారని ఆరోపించింది.
 
కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె, ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థిని గుర్‌మెహర్ కౌర్‌ ఆరోపణలు, విమర్శలతో నిత్యం వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసుపత్రి జలగలపై తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర: ఏపీ ప్రభుత్వం నిద్రపోతోందా.. నిద్ర నటిస్తోందా?