Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్కడిని చితక బాదిన సహచర విద్యార్థులు.. వైరల్‌గా మారిన వీడియో

పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే వీధి రౌడీల్లా మారి ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని టార్గెట్ చేసి కొందరు విద్యార్థులు చితకబాదుతున్న ఈ వీడియో

Advertiesment
School Students
, శుక్రవారం, 14 అక్టోబరు 2016 (14:11 IST)
పాఠశాల విద్యార్థులు తరగతిగదిలోనే వీధి రౌడీల్లా మారి ఓ విద్యార్థిని చితకబాదిన ఘటన వీడియో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఓ విద్యార్థిని టార్గెట్ చేసి కొందరు విద్యార్థులు చితకబాదుతున్న ఈ వీడియోను కేరళకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అనంతరం సంబంధిత అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ వీడియో చేరేంతవరకు ఈ వీడియోను ఫార్వర్డ్ చేయాలంటూ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో షేర్ చేస్తున్నారు. 
 
ఈ వీడియో ఏ పాఠశాలకు సంబంధించినది అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ.. విద్యార్థులు ధరించిన యూనిఫాంను బట్టి చూస్తే ఈ ఘటన కేంద్రీయ విద్యాలయంలో చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నారు. విద్యార్థుల అమానుష ప్రవర్తనను తెలిపేలా ఉన్న ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహాన్నివ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉమ్మడి పౌరస్మృతిపై చర్య అంతర్యుద్ధానికి దారితీస్తుందా : కౌంటర్ ఇచ్చిన వెంకయ్య