Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రాక్టీకల్ పరీక్షల్లో పాస్ కావాలా? నాతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందే.. ప్రిన్సిపల్

మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ ప్రబద్ధుడు. ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ చేయాలంటే.. తనతో శారీరక సంబం

Advertiesment
School Principal
, శుక్రవారం, 11 నవంబరు 2016 (19:20 IST)
మహిళలపై వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు వంటి నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడు ఓ ప్రబద్ధుడు. ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ చేయాలంటే.. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ప్రిన్స్‌పల్ వేధించిన ఘటన ఛత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌‍ఘడ్ రాష్ట్రంలోని రాయ్ ఘడ్ జిల్లాలోని సరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని సరస్వతీ శిశుమందిర్ స్కూల్‌లో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ళ బాలికను సాక్షాత్తు స్కూల్ ప్రిన్సిపల్ వేధించాడు. 
 
పరీక్షల్లో పాస్ కావాలంటే తనతో శారీరక సంబంధం కలిగివుండాల్సిందేనని షరతు పెట్టాడు. అయితే ఆ విద్యార్థిని ఈ విషయాన్ని తల్లిదండ్రులకు వెల్లడించింది. దీంతో పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సాహిబాబాద్‌ వస్త్ర మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. నిద్రిస్తూ 13మంది సజీవదహనం