సర్కారు కూలినా సరే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేను : సిద్ధరామయ్య
తమ ప్రభుత్వం కూలిపోయినా సరే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం పాటించే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళన
తమ ప్రభుత్వం కూలిపోయినా సరే.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఏమాత్రం పాటించే ప్రసక్తే లేదని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ కావేరీ నదిలోనే నీరు లేనప్పుడు తమిళనాడుకు రోజుకు 6 వేల క్యూసెక్కుల నీటి విడుదల ఆదేశాలను ఎలా అమలు చేయగలుగుతామన్నారు.
కావేరీ పర్యవేక్షక కమిటీ రోజుకు 3 వేల క్యూసెక్కులు వదలాలని సూచించగా, దాన్ని రెట్టింపు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం చాలా కష్టమని అన్నారు. ప్రజలు శాంతంగా ఉండాలని ఆయన కోరారు.
కాగా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడే అంశంపై సిద్ధరామయ్య తమ సహచర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను పరిశీలించి, న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్నది ఆయన ఉద్దేశంగా తెలుస్తోంది.