Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జైలులో జాలీగా నైటీలో తిరుగుతున్న శశికళ...

శశికళ జైలులో జాలీగా నైటీలో తిరుగుతున్న వీడియో విడుదలైంది. ఈ వీడియోలో శశికళ వాయిస్ బాగా వినిస్తోందని.. ఇంకా జైలులో చిన్నమ్మకు జైలు అధికారులు చేసిన వసతులను కూడా ఈ వీడియోలో చూపించారు. జైలులో ఖైదీ దుస్తుల

Advertiesment
జైలులో జాలీగా నైటీలో తిరుగుతున్న శశికళ...
, మంగళవారం, 18 జులై 2017 (14:50 IST)
అక్రమాస్తుల కేసుకు సంబంధించి బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు ఇటీవల కర్ణాటక డీఐజీ రూప నిజాలను వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జైలులో శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు ఆమె నివేదికలో పేర్కొన్నారు.

ఈ వివాదం తమిళనాట కలకలం రేపింది. జైలుశాఖ డీఐజీగా ఉన్న రూప జైలు పర్యవేక్షణ సందర్భంగా శశికళ రాజభోగాలు అనుభవిస్తున్నట్లు నివేదికలో తెలిపారు. ఇందులో భాగంగా శశికళ జైలు అధికారులకు, జైలుశాఖ డీజీపీలకు రూ.2కోట్లు లంచం ఇచ్చి.. జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. అయితే డీజీపీ రూప వేరు ప్రాంతానికి బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో శశికళ జైలులో జాలీగా నైటీలో తిరుగుతున్న వీడియో విడుదలైంది. ఈ వీడియోలో శశికళ వాయిస్ బాగా వినిస్తోందని.. ఇంకా జైలులో చిన్నమ్మకు జైలు అధికారులు చేసిన వసతులను కూడా ఈ వీడియోలో చూపించారు. జైలులో ఖైదీ దుస్తులు ధరించకుండా చిన్నమ్మ నైటీలో తిరగడాన్ని బట్టి చూస్తే డీఐజీ రూప నివేదికలో పేర్కొన్న విషయాలన్నీ నిజమేనని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రిగారూ... లీకేజీ చిన్నదే కానీ ప్యాకేజీ ఎంతో చెప్పండి... ఆళ్ల