Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శశికళ విడుదలపై 2 రోజుల్లో క్లారిటీ.. మంచి కబురు కోసం..?

శశికళ విడుదలపై 2 రోజుల్లో క్లారిటీ.. మంచి కబురు కోసం..?
, బుధవారం, 28 అక్టోబరు 2020 (10:45 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చలి శశికళకు అక్రమ ఆస్తుల కేసులో న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష , రూ.10 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. శశికళ జైలుకు వెళ్లి 3 సంవత్సరాల 8 నెలలు పూర్తయింది. ఇంకా మూడు నెలలు (జనవరి వరకు) ఆమె జైలులో ఉండాల్సి ఉంది.
 
కానీ, సత్ప్రవర్తన కారణంగా ఆమె ముందుగానే విడుదలయ్యే అవకాశముందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఈ విషయమై ఆమె తరఫు న్యాయవాది రాజా సెంధూర్‌ పాండియన్‌ మాట్లాడుతూ.. బెంగుళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉన్న శశికళ విడుదలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముందని తెలిపారు. 
 
కర్ణాటక రాష్ట్రంలో దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేది వరకు న్యాయస్థానాలకు సెలవు ప్రకటించారన్నారు. సెలవుల తరువాత న్యాయస్థానం నుంచి కబురు వస్తుందని ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఒకవేళ జరిమానా చెల్లించాలంటూ శశికళకు కబురు అందితే, తనకు లేఖ ద్వారా ఆ విషయం తెలియజేస్తారని, వెంటనే జరిమానాను న్యాయస్థానంలో చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు