Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శశికళను బూతులు తిడుతూ.. శాపనార్థాలు పెడుతూ... బెంగుళూరు జైలుకు కుప్పలుతెప్పలుగా లేఖలు

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను ప్రజలు బండబూతులు తిడుతూ... శాపనార్థాలు పెడుతున్నారు. పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పటికీ ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇంతకీ ఆ పని చేస్తుంది ఎ

Advertiesment
శశికళను బూతులు తిడుతూ.. శాపనార్థాలు పెడుతూ... బెంగుళూరు జైలుకు కుప్పలుతెప్పలుగా లేఖలు
, గురువారం, 23 మార్చి 2017 (13:27 IST)
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను ప్రజలు బండబూతులు తిడుతూ... శాపనార్థాలు పెడుతున్నారు. పరప్పన అగ్రహార జైలులో ఉన్నప్పటికీ ఆమెకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇంతకీ ఆ పని చేస్తుంది ఎవరో తెలుసా.. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే కార్యకర్తలే. జయలలిత అభిమానులే. 
 
ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో సహనిందితురాలిగా ఉన్న శశికళ బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్న విషయంతెల్సిందే. జైలులో ఉన్న ఆమెకు పదుల సంఖ్యలో ఉత్తరాలు వెళుతున్నాయి. ముఖ్యంగా గత ఫిబ్రవరి 15 మొదలు ఇప్పటివరకు 100 పైగా లేఖలు వచ్చాయి. ఈ లేఖలన్నీ 'శశికళ, సెంట్రల్ జైలు, పరప్పన అగ్రహార, బెంగళూరు 560100' అడ్రస్‌తో ఈ లేఖలు వస్తున్నాయి. 
 
ఈ లేఖల్లో శశికళను బండబూతులు తిడుతున్నారు. నోటికొచ్చినట్టు శాపనార్థాలు పెడుతూ రాస్తున్నారు. ''జయలలితకు ఎలాంటి అనారోగ్యం లేదనీ... పథకం ప్రకారమే శశికళ ఆమె హత్యకు కుట్రపన్నారనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. అదే విషయాన్ని లేఖల్లో ప్రస్తావిస్తున్నారు..'' అని జైలువర్గాలు తెలిపాయి. 
 
''మా తలైవిని, మాప్రియమైన అమ్మని చంపింది నువ్వే.. విశ్వాసఘాతకురాలివి, వెన్నుపోటుదారువి, నీకు కనీస కృతజ్ఞత లేదు... నీకు జీవితాన్ని, సర్వస్వాన్ని ఇచ్చిన వ్యక్తినే మోసం చేశావు.. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన నిర్వాకానికి అంతకంతకు అనుభవిస్తావు'' అని మచ్చుకు ఓ లేఖలోని సారాంశాన్ని జైలు వర్గాలు ఉటంకించాయి. 
 
శశికళకు రాసిన ఉత్తరాలు ఇళవరసి చదివారని, అభ్యంతరంగా ఉన్న ఉత్తరాలను ఆమె చించేశారని జైలు అధికారులు చెపుతున్నారు. మొదట్లో శశికళ కూడా ఈ ఉత్తరాలు చదివేవారని, తర్వాత వాటిని చూడటం మానేశారట. తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో సహ తిరుచ్చి, కరూర్, దిండిగల్, మదురై, ధర్మపురి, సేలం, కృష్ణగిరి తదితర ప్రాంతాల నుంచి ఈ ఉత్తరాలు వచ్చినట్టు జైలు అధికారులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2019 ఎన్నికల కోసం.. కొత్త టీవీ ఛానల్‌ పెట్టే యోచనలో పవన్ కల్యాణ్..?