Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై ఆర్కే నగర్‌లో శశికళ పోస్టర్లు... సీఎం పీఠం కోసం పరుగులు... అన్నాడీఎంకె ఏమౌతుంది?

గత వారం వరకూ అన్నీ తానై నడిపించిన అమ్మ జయలలిత శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో అన్నాడీఎంకె పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జయ స్నేహితురాలు శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమె ప్రణాళికులు

చెన్నై ఆర్కే నగర్‌లో శశికళ పోస్టర్లు... సీఎం పీఠం కోసం పరుగులు... అన్నాడీఎంకె ఏమౌతుంది?
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (21:18 IST)
గత వారం వరకూ అన్నీ తానై నడిపించిన అమ్మ జయలలిత శాశ్వత నిద్రలోకి జారుకోవడంతో అన్నాడీఎంకె పార్టీలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జయ స్నేహితురాలు శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని కోరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆమె ప్రణాళికులు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
చెన్నై ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి జయలలిత ప్రాతినిద్యం వహించిన సంగతి తెలిసిందే. జయలలిత మరణంతో ఇపుడక్కడ ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ స్థానం నుంచి తనే పోటీ చేస్తానని శశికళ సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్కే నియోజకర్గంలో శశికళ పోస్టర్లు వెలిశాయి. మరోవైపు శశికళ పోటీ చేస్తే అంగీకరించేది లేదని ఆమె వ్యతిరేక కూటమి ప్రకటనలు చేస్తోంది.
 
మరోవైపు జయలలిత మేనకోడలు అధ్యక్షురాలిని చేస్తూ జెఅన్నాడీఎంకె పార్టీని స్థాపించనున్నట్లు న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించారు. అన్నాడీఎంకె పార్టీని శశికళ కబ్జా చేస్తున్నారనీ, దాన్ని తాము ఎంతమాత్రమూ అంగీకరించేది లేదని ఆయన ప్రకటించారు. కాగా జయలలిత నివాసమున్న పోయెస్ గార్డెన్‌లో శశికళ అండ్ కో తిష్ట వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయ ఇంటిని మ్యూజియంగా మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్ రహదారి... 26,890 ఎకరాల భూసేకరణకు నిర్ణయం