శశికళకు మంచం ఇవ్వాలా...? వద్దా...?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళిన శశికళ అక్కడ సాధారణ ఖైదీలా జీవితం గడుపుతున్నారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళకు మంగళవారం సుప్రీంకోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష రూ.10 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జైల
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకు వెళ్ళిన శశికళ అక్కడ సాధారణ ఖైదీలా జీవితం గడుపుతున్నారు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏ2గా ఉన్న శశికళకు మంగళవారం సుప్రీంకోర్టు నాలుగేళ్ళ జైలు శిక్ష రూ.10 కోట్ల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. జైల్లో ప్రత్యేక సదుపాయాలు కావాలని శశికళ చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతో ఆమె బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైల్లో సాధారణ ఖైదీగా ఉంటున్నారు.
రాత్రి తన సెల్‌లో ఆమె నేలపైనే పడుకున్నారని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఆమెకు మంచం ఇవ్వాలా, వద్దా అనే అంశంపై వైద్యులు ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. శశికళతో పాటు ఆ సెల్‌లో మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. శశితో పాటు జైలు శిక్షపడిన ఆమె బంధువులు ఇళవరసి, సుధాకరన్‌లకు జైలు అధికారులు వేర్వేరు సెల్స్ కేటాయించారు.
శశికళకు జైలులో ఈ రోజు ఉదయం అల్పాహారంగా పులిహోర, పచ్చడి పెట్టారు. శశికళ ఉదయం కాసేపు ధ్యానం చేస్తున్నారు. తమిళనాడులో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి తెలుసుకోవడానికి శశికళ చాలా ఆశక్తి చూపుతున్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు జైలు సిబ్బందిని తమిళనాడులో ఏం జరుగుతుందో చెప్పాలని కోరుతోందట. నిన్న పళణిస్వామి సిఎంగా ప్రమాణం స్వీకారం చేశారని తెలియడంతో ఆనందంతో ఎగిరి గంతేసేంత పనిచేశారట శశికళ.