Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తమిళనాడు సీఎం కుర్చీలో శశికళ? అన్నాడీఎంకేలో జోరుగా చర్చ!

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కూర్చొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అన్నాడీఎంకే వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నెల 29వ తేదీన చెన్నైలోని శ్రీవారి కళ్య

తమిళనాడు సీఎం కుర్చీలో శశికళ? అన్నాడీఎంకేలో జోరుగా చర్చ!
, మంగళవారం, 27 డిశెంబరు 2016 (10:51 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కూర్చొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంపై అన్నాడీఎంకే వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నెల 29వ తేదీన చెన్నైలోని శ్రీవారి కళ్యాణ మండపంలో అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం, కార్యాచరణ మండలి సమావేశాలు జరుగనున్నాయి. 
 
తొలుత పార్టీ సర్వసభ్య మండలి సమావేశంలో పార్టీ పదవికి పోటీ చేసే అభ్యర్థి ఐదేళ్లపాటు పార్టీ సభ్యత్వం కలిగి ఉండాలన్న నిబంధనను సడలించనున్నారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ఈ విషయాన్ని కొద్ది రోజుల ముందే ప్రకటించారు. పార్టీ నిబంధనను సడలించిన మీదట శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఆ తర్వాత పార్టీ కార్యాచరణ మండలి సమావేశం జరుగనుంది. ఈ రెండు సమావేశాల్లోనూ జయలలిత మృతికి సంతాప తీర్మానాలు చేస్తారు.
 
అలాగే అన్నాడీఎంకే శాసనసభ్యుల సమావేశం నిర్వహించి సభాపక్ష నాయకురాలిగా శశికళను ఎన్నుకునే అవకాశముందని చర్చ జరుగుతోంది. ఢిల్లీ పర్యటన అనంతరం ఏడురోజులుగా శశికళను కలుసుకోని సీఎం పన్నీర్‌‌సెల్వం సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా పోయెస్‌గార్డెన్‌కి వెళ్లి ఆమెతో 10 నిమిషాలు భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనూ ఈ అంశమే ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. 
 
అయితే, ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన నేతలు, ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా తమ నేతకే కట్టబెట్టేలా పావులు కదుపుతున్నారు. అలా కాకుండా శశికళ వర్గం నడుచుకుంటే వారిపై ప్రతీకారం తీర్చుకునే దిశగా ముఖ్యమంత్రి వర్గీయులు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాత నోట్లపై కొత్త పిడుగు.. రూ.10 వేలకు మించి ఉంటే ఫైన్