సీఎం పదవికి పన్నీర్ సెల్వం రిజైన్... తమిళనాడు శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవం
తమిళనాడు శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం తొలుత శశికళ పేరును ప్రతిపాదించగా, శాసనసభలు నేతలు అందుకు తమ మద్దతు తెలిపారు. ఇప్పటివరకు శాసనసభా పక్షనేతగా ఉన్న ఓ.పన
తమిళనాడు శాసనసభాపక్షనేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం తొలుత శశికళ పేరును ప్రతిపాదించగా, శాసనసభలు నేతలు అందుకు తమ మద్దతు తెలిపారు. ఇప్పటివరకు శాసనసభా పక్షనేతగా ఉన్న ఓ.పన్నీర్ సెల్వం స్థానంలో శశికళ కొనసాగుతారు.
కాగా, తమిళనాడు సీఎంగా శశికళ ఎన్నిక కావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో, చిన్నమ్మ సీఎం కావడానికి మార్గం సుగమమైనట్లు అయింది. అన్నాడీఎంకే పార్టీ కార్యాలయం బయట ఆ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా మహిళా కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఉన్నారు.
ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత అంటే రెండు నెలల్లోనే శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా శశికళ పేరును పన్నీర్ సెల్వమే రాజీనామా చేయడం గమనార్హం.