Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పన్నీర్‌కే సంపూర్ణ మద్దతు.. అసలు సీన్ ఇకపైనే.. ఓపీఎస్ బల నిరూపణ ఉంటుందా? ఏం జరుగుతుంది?

అక్రమాస్తుల కేసులో మంగళవారం ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక

Advertiesment
పన్నీర్‌కే సంపూర్ణ మద్దతు.. అసలు సీన్ ఇకపైనే.. ఓపీఎస్ బల నిరూపణ ఉంటుందా? ఏం జరుగుతుంది?
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:28 IST)
అక్రమాస్తుల కేసులో మంగళవారం ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసనలు, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కూడా ఈ వ్యతిరేక సెగ తాకుతోంది.
 
ఈ నేపథ్యంలో తిరుప్పూరు కార్పొరేషన్ 60 వార్డు అన్నాడీఎంకే కార్యకర్తలు, నిర్వాహకులు, ఎంజీఆర్‌ మన్రం ప్రతినిధులతో పాటు.. వందలాదిమంది కార్యకర్తలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా క్యాంపు రాజకీయాలతో తన ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా జాగ్రత్తపడుతున్న శశికళ వారందరిని గోల్డెన్ బే రిసార్టులో దాచిపెట్టిన సంగతి తెలిసిందే. 
 
పన్నీర్ తిరుగుబాటు ఎగురవేసిన మరునాడే ఎమ్మెల్యేలను ఆమె గోల్డెన్ బే రిసార్టుకు తరలించారు. రిసార్టులో ఎమ్మెల్యేల ఖర్చులకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. గడిచిన వారం రోజులకు గాను దాదాపు కోటి రూపాయలకు పైనే రిసార్టు యాజమాన్యం బిల్లులు వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నమ్మ జైలుకు వెళ్తే.. పన్నీర్ సెల్వం బల నిరూపణ చేస్తారా? లేకుంటే పన్నీర్‌ను సీఎంగా మళ్లీ ప్రమాణం చేయిస్తారా? అలా గాకుండా శశి వర్గం నుంచి కొత్త సీఎం అభ్యర్థిని నియమిస్తారా? అనేది తెలియాల్సి వుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ ఆశలు గల్లంతు... చిన్నమ్మతో జైలుకెళ్లనున్న ఇళవరసి - సుధాకరన్