Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నానా? నా ఫోటోలు విడుదల చేయండి.. జయలలిత.. నో చెప్పిన శశికళ

తమిళనాడు దివంగత సీఎం జయలలిత డీహైడ్రేషన్ కారణంగా 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. ఆమె ఫోటోలను విడుదల చేయాలని డిమాండ్ ప్రజలు చేశారు. 75 రోజుల పాటు కార్యకర్తలు,

ఇన్ని రోజులు ఆస్పత్రిలో ఉన్నానా? నా ఫోటోలు విడుదల చేయండి.. జయలలిత.. నో చెప్పిన శశికళ
, గురువారం, 8 డిశెంబరు 2016 (15:49 IST)
తమిళనాడు దివంగత సీఎం జయలలిత డీహైడ్రేషన్ కారణంగా 75 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. ఆమె ఫోటోలను విడుదల చేయాలని డిమాండ్ ప్రజలు చేశారు. 75 రోజుల పాటు కార్యకర్తలు, అభిమానులు, అపోలో ఆస్పత్రి ఆవరణలోనే అమ్మ కోసం వేచి చూసినా ఆమెను కడసారి ప్రాణాలతో చూడలేకపోయారు. అపోలో నుంచి అమ్మ మృతదేహమే బయటికి వచ్చింది. 
 
అమ్మ ఆస్పత్రిలో ఉండగా, తన ఫోటోలను విడుదల చేయమని తన నెచ్చెలి శశికళ వద్ద చెప్పారని.. కానీ శశికళ అమ్మ చివరి కోరికను నెరవేర్చలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఫోటోలతో పాటు తన ఆరోగ్యంపై ప్రకటన విడుదల చేయాల్సిందిగా అమ్మ కోరినా శశికళ  ఏమాత్రం పట్టించుకోలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

జయలలితకు స్పృహ వచ్చిన తర్వాత వైద్యుల వద్ద తాను ఆస్పత్రిలో చేరి ఎన్ని రోజులైందని అడిగారని, అందుకు వైద్యులు బదులివ్వడంతో.. ''అయ్యో చాలా రోజులుగా నేను ఆస్పత్రిలో ఉన్నానా?'' ప్రజలు నాకోసం వేచి చూస్తారే.. అని ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. 
 
వెంటనే తన ఫోటోలను, ప్రకటనతో పాటు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయమని వైద్యులతో చెప్పారు. ఈ విషయాన్ని వైద్యులు కూడా శశికళ వద్ద చెప్పారు. కానీ ఆమె అందుకు నిరాకరించారని ఆస్పత్రి వర్గాల సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాపం పన్నీర్ సెల్వం... జయ ఫోటో జేబులో పెట్టుకుని నెగ్గుకురాగలరా...? శశికళ పవరెంతో...?