Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సర్దార్ పటేల్ వారసత్వాన్ని అణగదొక్కేశారు : హోం మంత్రి అమిత్ షా

amit shah

ఠాగూర్

, మంగళవారం, 29 అక్టోబరు 2024 (13:31 IST)
గతంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కీర్తిని తుడిచిపెట్టడానికి, ఆయన వారసత్వాన్ని అణగదొక్కడానికి ప్రయత్నాలు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆరోపించారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జెండా ఊపి ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఆయన ప్రసంకిస్తూ, భారత స్వాతంత్ర్య పోరాటం అనంతరం పటేల్‌ చొరవతోనే 550 సంస్థానాలు భారత్‌లో విలీనమై.. దేశం ఏకమైందని గుర్తు చేశారు. జూనాగఢ్‌, హైదరాబాద్‌, లక్షదీవులను భారత్‌లో కలిపేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయన్నారు. పటేల్‌ దేశం కోసం ఎంత చేసినప్పటికీ ఆయనకు భారతరత్న ఇవ్వడానికి గత ప్రభుత్వం చాలాకాలం నిరాకరించిందని విమర్శించారు.
 
సర్దార్ పటేల్ 1950లో మరణించారని ఆయన మరణించిన 41 సంవత్సరాల తర్వాత 1991లో ఆయనకు భారతరత్న పురస్కారాన్ని అందించారని అమిత్‌ షా పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కెవాడియాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పటేల్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసి, సముచిత రీతిలో సత్కరించారని అన్నారు. 
 
స్వాంతత్ర్యం వచ్చిన నాటినుంచి నేటివరకు దేశ ప్రజలు ఎంతో ఐక్యంగా ఉన్నారన్నారు. 2047 నాటికి భారత్‌ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం ప్రతిఏటా పటేల్‌ జయంతి అయిన అక్టోబరు 31ని ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’గా జరుపుకుంటోందని గుర్తు చేశారు. 
 
ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహం చరిత్ర సృష్టించింది. దీని ఎత్తు 597 అడుగులు. ఇది గుజరాత్‌లోని నర్మదా నదీ తీరంలో ఉంది. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో, ఆ తర్వాత భారత ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు పటేల్‌ చేసిన కృషికి స్మృతిగా దీనిని నిర్మించారు. 180 కి.మీ. వేగంతో గాలులు వీచినా.. రెక్టార్ స్కేలుపై 6.5 తీవ్రతతో భూకంపం వచ్చినా తట్టుకునేలా విగ్రహాన్ని నిర్మించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభం