Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీర్‌కు శరత్ కుమార్ మద్దతు.. ఆ వర్గంలో చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా? అని అడుగుతారు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే నామక్కల్‌ నియోజకవర్గ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్‌ పన్నీరుకు మద్దతు తెలిపారు. ఒక్క తంబిదురై మినహా మ

పన్నీర్‌కు శరత్ కుమార్ మద్దతు.. ఆ వర్గంలో చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా? అని అడుగుతారు
, శనివారం, 11 ఫిబ్రవరి 2017 (19:55 IST)
తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంకు రాజ్యసభ సభ్యుల మద్దతు కూడా పెరుగుతోంది. ఇప్పటికే నామక్కల్‌ నియోజకవర్గ ఎంపీ సుందరం, కృష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్‌ పన్నీరుకు మద్దతు తెలిపారు. ఒక్క తంబిదురై మినహా మిగిలిన ఎంపీలంతా పన్నీర్‌సెల్వానికే మద్దతిస్తారంటూ వ్యాఖ్యానించారు.

పార్టీ సభ్యులెవరూ తంబిదురై పన్నీర్‌ క్యాంపులో ఉండడానికి ఇష్టపడడం లేదన్నారు. పార్టీ ఎంపీలందరికీ జయలలిత మృతి విషయంలో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకేకి అటు లోక్‌సభలోనూ, రాజ్యసభలోనూ కలిపి 50మంది ఎంపీలున్నారు
 
మరోవైపు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరం ఫుల్ జోష్‌లో ఉంది. ఒక్కరొక్కరే ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ సభ్యుడు పొన్నియన్ పన్నీర్ సెల్వం గూటికి చేరుకున్నారు. ఇదే కోవలో హీరో శరత్ కుమార్ కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు. త్వరలో తమిళనాడు సంక్షోభం ముగుస్తుందని, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పొన్నియన్ అన్నారు. 
  
లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తప్ప పార్టీ ఎంపీలంతా సెల్వం గూటికి చేరుతున్నట్లు ఇద్దరు ఎంపీలు అశోక్ కుమార్, సుందరం చెప్పారు. లేచింది మొదలు నియోజకవర్గంలో తిరగాలంటే సెల్వం గూటికి చేరడమే మంచిదని అశోక్ కుమార్ అన్నారు. ప్రత్యర్థి వర్గంలో చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా అని ప్రజలను తనను ప్రశ్నిస్తారన్నారు. అమ్మ తమను వదిలిపోయిన రోజున అందరూ కన్నీటి సముద్రంలో మునిగిపోతే శశికళ మాత్రం 15 మంది కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని వచ్చారని మరో ఎంపీ సుందరం అన్నారు. కంట్లో నీటి చుక్క రాలేదని.. అమ్మను చూసేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళకు కంట్లో నలుసుగా మారిన పన్నీర్.. మిస్డ్ కాల్ సర్వేలో ''అన్న''దే పైచేయి..