Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రగ్స్ మత్తు వీడిన ప్రముఖ హీరో... ప్రభుత్వంతో చర్చల్లో బిజీ బిజీ

ఇటీవల జరిగిన అభిమానుల సమావేశంలో ప్రసంగాన్ని ముగిస్తూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు ఓ సందేశాన్నిచ్చారు. కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమంటూనే.. తన అనుభవంతో చెబుతున్నానని ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండమని సూచించారు. ఇప్పటివరకు

డ్రగ్స్ మత్తు వీడిన ప్రముఖ హీరో... ప్రభుత్వంతో చర్చల్లో బిజీ బిజీ
, గురువారం, 18 మే 2017 (18:34 IST)
ఇటీవల జరిగిన అభిమానుల సమావేశంలో ప్రసంగాన్ని ముగిస్తూ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు ఓ సందేశాన్నిచ్చారు. కుటుంబాన్ని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమంటూనే.. తన అనుభవంతో చెబుతున్నానని ధూమపానానికి, మద్యపానానికి దూరంగా ఉండమని సూచించారు. ఇప్పటివరకు తాగనివారు ఇకపై తాగవద్దని, ఇప్పటికే తాగుతున్నవారు కొద్దిగా తగ్గించుకునేందుకు ప్రయత్నించమని కోరుతూ ప్రసంగాన్ని ముగించారు.
 
తాజాగా మరో హీరో ఈ ప్రవచనాల దారిపట్టాడు. అతడు ఎవరో కాదు... మాదకద్రవ్యాల మత్తులో ఆరోగ్యాన్ని, పలుకుబడి సర్వం పోగొట్టుకుని, ఆయుధాల కేసులో జైలు శిక్షను సైతం అనుభవించి ఇప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంజయ్‌దత్ దేశవ్యాప్తంగా డీఎడిక్షన్ సెంటర్లను ప్రారంభిస్తానంటున్నాడు. తల్లిదండ్రులు ఆర్థికంగా ఉన్నవారు కావడంతో తాను మాదకద్రవ్యాల ప్రభావం నుండి కోలుకునేందుకు అమెరికాలో ఖరీదైన చికిత్స తీసుకున్నానని, అంత స్తోమత లేని వారి కోసం డీఎడిక్షన్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నానని, అటు నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే సెంటర్లను ఏర్పాటు చేస్తానని తెలియజేసారు సంజయ్‌దత్.
 
వారి వారి సినిమాల ఆడియో ఫంక్షన్లకు హాజరై, అక్కడి తొక్కిసలాటలో లేదా తిరుగు ప్రయాణంలో ఒకరిద్దరు అభిమానులు మరణించడంతో కొందరు తెలుగు హీరోలు కూడా అభిమానుల పట్ల తమ ప్రేమను అప్పుడప్పుడూ చాటుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, కుటుంబానికి మీ అవసరం ముఖ్యం.. తిరిగి జాగ్రత్తగా ఇంటికెళ్లండి అంటూ. ఇక రజనీ, సంజయ్‌లు ఆదర్శంగా మరింత ఎక్కువగా అభిమానులకు బోధనలు షురూ చేస్తారేమో. తమ అభిమాన హీరోలు చెప్తే ఏ కొందరు అభిమానులైనా దుర్వ్యసనాలను వీడి సాధారణ జీవితానికి అలవాటు పడతారేమో చూద్దాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోకియా నుంచి 3310 పేరిట 2జీ ఫోన్‌.. ధర రూ. 3310