Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రేషన్ కార్డు కోసం వెళితే.. కూల్ డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి..?: సందీప్ కుమార్ బాధిత మహిళ

ఇద్దరు మహిళలతో రాసలీలల్లో మునిగిపోయి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ గురించి రోజుకో వార్త వెలువడుతుంది. సందీప్ కుమార్ పోర్న్‌హబ్ ఉద్యోగి అని యూజర్లు అప్‌లోడ్ చేసే కంటెంట్‌పై

Advertiesment
Sandeep Kumar's
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (17:06 IST)
ఇద్దరు మహిళలతో రాసలీలల్లో మునిగిపోయి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఆప్ మాజీ మంత్రి సందీప్ కుమార్ గురించి రోజుకో వార్త వెలువడుతుంది. సందీప్ కుమార్ పోర్న్‌హబ్ ఉద్యోగి అని యూజర్లు అప్‌లోడ్ చేసే కంటెంట్‌పై ఆధారపడి నడుస్తున్న పోర్న్‌హబ్ వెబ్‌సైట్ సోషల్ మీడియాలో తెలపడంతో అందరూ షాక్ తిన్నారు. సందీప్‌కుమార్ తమ ఉద్యోగేనని ప్రపంచంలో అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్లలో ఒకటైన ఈ వెబ్‌సైట్ ఓ ప్రకటనలో పేర్కొంది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, సందీప్ కుమార్ సహా, ఉద్యోగులందరినీ తాము ప్రేమిస్తున్నట్టు ఓ ట్వీట్ కూడా పెట్టింది. 
 
మరోవైపు వీడియోలపై విచారణ చేపట్టేందుకు దిల్లీ పోలీస్‌ క్రైం బ్రాంచ్‌ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సందీప్‌తో పాటు ఆ వీడియోలో కన్పించిన ఇద్దరు మహిళలను కూడా పోలీసులు విచారించనున్నారు. ఇద్దరు మహిళలతో రాసలీలలు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన సీడీ లభించడంతో సందీప్‌ను కేబినెట్‌ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తొలగించారు. అయితే తానే తప్పు చేయలేదని, ఆ సీడీ అంతా ఓ కుట్ర అని సందీప్‌ ఆరోపించారు.
 
ఇదిలా ఉంటే సందీప్‌తో పాటు రాసలీలల సీడీలో కనపడిన మహిళ ప‌లు ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు దుమారం రేపుతోంది. తాను మంత్రివ‌ద్ద‌కు రేషన్ కార్డ్ కోసం వెళ్లిన సమయంలో, మ‌త్తుమందు క‌లిపిన కూల్‌డ్రింక్‌ని ఇచ్చి సందీప్ కుమార్ త‌నపై అఘాయిత్యం చేశాడ‌ని ఆమె ఢిల్లీ సుల్తాన్‌పూరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు దీనిపై పూర్తి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. కూల్ డ్రింక్స్‌లో మత్తుమందిచ్చి మంత్రి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆ మహిళ ఆరోపించడంతో సందీప్‌పై అత్యాచారం కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోడలికి మళ్లీ ఆడపిల్లే పుడుతుందన్న జ్యోతిష్యుడు.. అత్తమామల యాసిడ్ దాడి