Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిరూపిస్తే.. పార్లమెంట్‌లోనే ఆత్మహత్య చేసుకుంటా : ఎస్పీ ఎంపీ

పాకిస్థాన్ గూఢచర్య కేసులో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే పార్లమెంట్ భవన్‌లోనే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మనవార్ సలీమ్ ప్రకటించారు.

Advertiesment
Samajwadi Party MP Munawwar Saleem
, ఆదివారం, 30 అక్టోబరు 2016 (11:19 IST)
పాకిస్థాన్ గూఢచర్య కేసులో తనకు సంబంధం ఉన్నట్టు నిరూపిస్తే పార్లమెంట్ భవన్‌లోనే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు మనవార్ సలీమ్ ప్రకటించారు. 
 
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో పని చేసే దౌత్యాధికారి గూఢచర్యం కేసులో అరెస్టు అయిన విషయం తెల్సిందే. అతని వద్ద జరిపిన విచారణలో ఎస్పీ ఎంపీ సలీమ్‌కు పీఏగా ఉన్న ఫర్హత్ అనే వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ వీసా అధికారి మెహమూద్ అఖ్తర్‌తో ఫర్హత్ కుమ్మక్కై గూఢచర్యానికి పాల్పడ్డాడు. ఫర్హాత్‌తో పాటు కీలకమైన రక్షణ పత్రాలు చేతులు మారేందుకు సహకరించిన మౌలానా రంజాన్, సుభాష్ జాంగిర్‌ అనే ఇద్దరు ఢిల్లీ క్రైం బ్రాంచ్ అరెస్టు చేశారు. 
 
దీనిపై సలీం ఘాటుగానే స్పందించారు. భారత్‌లోని పాక్ హైకమిషన్ అధికారులతో తనకు సంబంధాలున్నాయని నిరూపిస్తే తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించారు. 'నా జీవితం తెరిచిన పుస్తకం. ఏడాది క్రితం ఫర్హాత్ నా దగ్గరకు వచ్చారు. అతని వెరిఫికేషన్ కోసం ఆ సమాచారాన్ని నేను పార్లమెంటుకు, ప్రభుత్వానికి పంపాను' అని తెలిపారు. గూఢచర్యం సిండికేట్‌లో ఫర్హాత్‌కు సంబంధం ఉందో తాను నిశ్చయంగా చెప్పలేనని, అయితే ఢిల్లీ పోలీసులు సహా మూడు సంస్థల విచారణ తర్వాత ఫర్హాత్‌కు క్లీన్ చిట్ వచ్చినందునే అతన్ని తన పీఏగా నియమించుకున్నట్టు సలీమ్ వివరణ ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ములాయం కుటుంబ విభేదాలన్నీ కేవలం డ్రామాలే : మాయావతి