Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సల్మాన్ ఖాన్ ఇంటిని పేల్చివేస్తా: బాలుడి బెదిరింపు

Advertiesment
సల్మాన్ ఖాన్ ఇంటిని పేల్చివేస్తా: బాలుడి బెదిరింపు
, శనివారం, 14 డిశెంబరు 2019 (14:44 IST)
బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ఇంటిని బాంబుతో పేల్చివేస్తానని ఘజియాబాద్ నగరానికి చెందిన ఓ పదహారేళ్ల బాలుడు హెచ్చరించిన ఘటన ముంబయి నగరంలో సంచలనం రేపింది.

‘‘ముంబయి నగరంలోని బాంద్రాలోని బాలీవుడ్ ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ఇల్లు అయిన గెలాక్సీ అపార్టుమెంటును మరో రెండు గంటల్లో పేల్చివేస్తాను...మీరు పేలుడును ఆపగలిగితే ఆపుకోండి’’ అంటూ సవాలు చేస్తూ ఘజియాబాద్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడు ముంబయిలోని బాంద్రా పోలీసులకు మెయిల్ పంపించారు.

ఈ మెయిల్ వచ్చిన వెంటనే ముంబయి అదనపు పోలీసు కమిషనర్ డాక్టర్ మనోజ్ కుమార్ శర్మతోపాటు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందం బాంద్రాలోని గెలాక్సీ అపార్టుమెంటుకు వచ్చి తనిఖీలు చేసింది.
 
పోలీసులు గెలాక్సీ అపార్టుమెంటుకు వచ్చినపుడు ఇంట్లో హీరో సల్మాన్ ఖాన్ లేరు. పోలీసులు వెంటనే గెలాక్సీ అపార్టుమెంటులోని సల్మాన్ ఖాన్ తల్లిదండ్రులు సలీం, సల్మాఖాన్, ఆయన సోదరి అర్పితలను బయటకు పంపించారు. పోలీసులు నాలుగుగంటలపాటు గెలాక్సీ అపార్టుమెంటులో నలువైపులా తనిఖీలు చేశారు.

గెలాక్సీ అపార్టుమెంటు మొత్తాన్ని పరిశీలించాక ఎలాంటి బాంబు లేదని తేలడంతో సల్మాన్ ఖాన్ కుటుంబాన్ని లోపలకు అనుమతించారు. మెయిల్ పంపించింది ఘజియాబాద్ నగరానికి చెందిన 16 ఏళ్ల బాలుడని గుర్తించామని బాంద్రా పోలీసులు చెప్పారు.

బాంద్రా నుంచి ప్రత్యేక పోలీసు బృందం ఘజియాబాద్ కు వెళ్లి బాంబు ఉందని బెదిరించిన 16ఏళ్ల బాలుడిని పట్టుకొని వచ్చి జువైనల్ కోర్టులో ప్రవేశపెట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్భయ దోషుల ఉరి అమలును ప్రత్యక్ష ప్రసారం చేయాలి : సుప్రీంలో పిల్