Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోవాలో రష్యా యువతిపై అత్యాచారం.. గెస్ట్ హౌస్ యజమానే...

గోవాలో రష్యా యువతిపై అత్యాచారం.. గెస్ట్ హౌస్ యజమానే...
, శనివారం, 30 ఏప్రియల్ 2016 (09:36 IST)
ప్రముఖ సముద్రతీర పర్యాటక ప్రాంతమైన గోవాలో దారుణం జరిగింది. విహారయాత్రకు వచ్చిన రష్యా యువతి అత్యాచారానికి గురైంది. ఈ దారుణానికి పాల్పడింది గెస్ట్ హౌస్ యజమానే కావడం గమనార్హం. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారానికి గురైనట్టు తేలిందన్నారు.
 
శుక్రవారం మొర్జిం క్లబ్ గెస్ట్ హౌస్లో అద్దెకు తీసుకున్న గదిలో ఆమె నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పెర్నెమ్ ఇన్స్పెక్టర్ సంజయ్ దాల్వి చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్య పరీక్షలకు పంపారు. 
 
నిందితుడిని జేమ్స్ డిసౌజాగా గుర్తించామని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కాగా ఈ యువతి మే మొదటి వారంలో స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్థికవేత్త ఎన్.‌కే సింగ్‌కు జపాన్ పురస్కారం 'ది ఆర్డర్‌ ఆఫ్‌ ది రైజింగ్‌ సన్'