ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపడానికి మంత్రి సుపారీ ఇచ్చాడు: ఎంపీ శోభ
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఎంపీ శోభ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులో ఒక ఆర్ఎస్ఎస్ కార్యర్తను చంపేందుకు ఒక మంత్రే స్వయంగా సుపారీ ఇచ్చారనీ ఆమె ఆరోపించారు. ఇటీవల బెంగళూరులో ఆరెస్సెస్ కార్యకర్త రుద్రే
కర్నాటక రాష్ట్రానికి చెందిన ఎంపీ శోభ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగుళూరులో ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తను చంపేందుకు ఒక మంత్రే స్వయంగా సుపారీ ఇచ్చారనీ ఆమె ఆరోపించారు. ఇటీవల బెంగళూరులో ఆరెస్సెస్ కార్యకర్త రుద్రేశ్ దారుణ హత్యకు గురయ్యారు. ఇది దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజె మాట్లాడుతూ... శివాజీనగర్ ఎమ్మెల్యే, నగరాభివృద్ధి శాఖ మంత్రి రోషన్ బేగ్ ఈ హత్య చేయించారని... దీనికోసం హంతకులకు ఆయన సుపారీ ఇచ్చారని ఆరోపించారు.
శివాజీనగర్ నియోజకవర్గ పరిధిలో రాజకీయంగా రుద్రేశ్ ఎదుగుతుండటంతో... రోషన్ బేగ్ ఓర్వలేకపోయారని, అందుకే ఆయనను తుదముట్టించారని ఆరోపించారు. ఈ కేసులో మంత్రి హస్తం ఉండటంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్‌లు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. తనపై శోభా కరంద్లాజె తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం రాజకీయ ప్రచారం కోసమే ఆమె ఈ ఆరోపణలు చేశారని, ఎన్నో ఏళ్లుగా శివాజీ నగర్‌లో ఉంటున్న తాను... అన్ని వర్గాలను కలుపుకుని పోతున్నట్టు చెప్పారు. శోభపై పరువునష్టం దావా వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు.