బీహార్ ఇంటర్ పరీక్షల్లో టాపర్లుగా వచ్చిన పది మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ పరీక్షలకు టాపర్లుగా వచ్చిన విద్యార్థుల్లో టాపర్‌గా నిలిచిన రూబీ రాయ్ హాజరుకాలేదు.
దీనిపై ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... ఆమెకు అనారోగ్యంగా ఉందని, అందుకే పరీక్షకు హాజరుకాలేదన్నారు. దీంతో విద్యాశాఖాధికారులు ఆమెపై చర్యలు తీసుకుంటామన్నారు. వీలైతే ఆమె ఫలితాలను రద్దు చేస్తామని తెలిపారు.
కాగా, బీహార్ ఫలితాల్లో సైన్స్ విభాగంలో టాపర్లుగా నిలిచిన 9 మందితో పాటు, ఆర్ట్స్‌లో టాపర్లుగా నిలిచిన ఐదుగురికి రీ ఎగ్జామ్ నిర్వహించగా, 13 మంది హాజరయ్యారు. కాగా, వీరిని ఓ టీవీ చానెల్ చేసిన ఇంటర్వ్యూలో షాక్‌కు గురయ్యే సమాధానాలు చెప్పడంతో సీఎం ఆదేశాలమేరకు వారికి రీ ఎగ్జామ్ నిర్వహించిన విషయం తెల్సిందే.