నటి రాధిక రాడాన్ టీవీకి ఐటీ ఎటాక్... రాధికను శరత్ కుమార్ బాగా ఇరికించారా...?
శశికళకు మద్దతు పలికడమే కాకుండా రాడాన్ టీవీ నుంచి ఆర్కే నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 7 కోట్లు పంచేశారంటూ నటుడు శరత్ కుమార్ పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఇంటిపైన, అలాగే ఆయన భార్య, నటి రాధిక రాడాన్ టీవీ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్త
శశికళకు మద్దతు పలికడమే కాకుండా రాడాన్ టీవీ నుంచి ఆర్కే నియోజకవర్గంలోని ప్రజలకు రూ. 7 కోట్లు పంచేశారంటూ నటుడు శరత్ కుమార్ పైన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో ఆయన ఇంటిపైన, అలాగే ఆయన భార్య, నటి రాధిక రాడాన్ టీవీ కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఏదో అలా సినిమాలు, టీవీ సీరియళ్లు చేసుకుంటున్న రాధికకు ఐటీ సోదాలు షాక్‌కు గురిచేశాయి. మరి ఈ సోదాల్లో అక్రమంగా బయటపడే డబ్బు ఎంతన్నది తెలియాల్సి వుంది.
మరోవైపు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కే నగర్ నియోజకవర్గంలో అంతా బావుంటే రేపే ఎన్నికలు జరగాల్సి వుంది. కానీ పరిస్థితి తారుమారయింది. ఇక్కడ నుంచి పోటీకి దిగిన దినకరన్ తన శక్తి మేరకు ఎలాగైనా గెలిచి తీరాలని గట్టి ప్రయత్నమే చేశారు. ఈ ప్రయత్నంలో భాగంగా సుమారు 90 కోట్ల రూపాయలకు పైగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సాధారణమైన నియోజకవర్గమైతే వదిలేసేవారే కానీ జయలలిత ప్రాతినిధ్యం వహించినది కావడంతో ఎలాగైనా గెలిచి తీరాలని అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. మరోవైపు డబ్బు పంచారంటూ 9 మంది మంత్రులపై ఆరోపణలు రావడంతో వారిని ఐటీ శాఖ విచారిస్తోంది. ఇంకోవైపు పార్టీ గుర్తు రెండాకులు లేకుండా టోపీ గుర్తుపై పోటీ చేయాల్సి రావడం ఒక రకంగా అన్నాడీఎంకే పార్టీకి పెద్ద దెబ్బయ్యింది.
అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు డబ్బు పంచినట్లు ఆరోపణలు రావడంతో వారి ఇళ్లపై ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ వార్తలన్నిటినీ విన్న శశికళ జైల్లోనే ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తమ్మీద జయలలిత తను ప్రాతినిధ్యం వహించిన స్థానం నుంచి శశి వర్గం గెలుస్తుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.