Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒంటెలపై బరువును మోయిస్తున్నారే.. అవి చిత్రహింసలు కావా? జల్లికట్టుపై కిరణ్ బేడీకి చుక్కలు చూపించిన ఆర్జే బాలాజీ

పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ తమిళ యువ సినీ నటుడు ఆర్జే బీలాజీ అడిగిన ప్రశ్నలకు తగు సమాధానాలు చెప్పలేకపోయారు. జల్లికట్టుపై నిషేధం సమం జసమేనంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్జే బాలాజీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప

ఒంటెలపై బరువును మోయిస్తున్నారే.. అవి చిత్రహింసలు కావా? జల్లికట్టుపై కిరణ్ బేడీకి చుక్కలు చూపించిన ఆర్జే బాలాజీ
, ఆదివారం, 15 జనవరి 2017 (13:41 IST)
పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీ తమిళ యువ సినీ నటుడు ఆర్జే బీలాజీ అడిగిన ప్రశ్నలకు తగు సమాధానాలు చెప్పలేకపోయారు. జల్లికట్టుపై నిషేధం సమం జసమేనంటూ చేసిన వ్యాఖ్యలపై ఆర్జే బాలాజీ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మౌనం పాటించారు. చెన్నైలో ఓ ప్రసార మాధ్యమ సంస్థ ఆధ్వర్యంలో జల్లికట్టుపై వివాద వేదిక నిర్వహించారు. ఈ వివాదంలో కిరణ్‌బేడీ, తమిళ సినీ నటీమణులు ఖుష్బూ, సుహాసిని, యువ సినీ నటుడు ఆర్జే బాలాజీ పాల్గొన్నారు. 
 
ఈ వివాదంలో కిరణ్‌బేడీ మాట్లాడుతూ జలికట్టుపేరుతో వృషభాలను చిత్రహింసలకు గురిచేస్తుండటం వల్ల సుప్రీం కోర్టు ఆ క్రీడపై నిషేధం విధించటం సబబేనని అన్నారు. వెంటనే ఆర్జే బాలాజీ జోక్యం చేసుకుని తాను గుజరాత్‌లో పర్యటించానని, ఆ రాష్ట్రంలో ఒంటెలపై మోయలేనంత బరువును మోయిస్తున్నారని అవి చిత్రహింసలు కావా? అని ప్రశ్నించారు. 
 
కిరణ్‌బేడీ ఆ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక 'మనమంతా కోర్టు తీర్పును శిరసావహించాలి' అని ముక్తసరిగా సమాధానం చెప్పారు. ఆర్జే బాలాజీ మళ్లీ మాట్లాడుతూ కోర్టు తీర్పును తమిళ ప్రజలు ఎల్లప్పుడూ శిరసా వహిస్తారని, అయితే కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన ఉత్తర్వులను పాటించని ఆ రాష్ట్రంపై ఎలాంటి చర్యలు తీసుకోగలిగామని అడిగారు. 
 
కిరణ్‌బేడీ ఆ ప్రశ్నకూ బదులివ్వక తలవాల్సి తన పాదాలను చూస్తుండగా ఆర్జే బాలాజీ మళ్లీ జోక్యం చేసుకుని మీ పాదాలు తొడుక్కున పాద రక్షలు సైతం పశువుల చర్మం ద్వారా తయారైనవని మరి పశువుల చర్మాలను ఎగుమతి చేసే సంస్థలపై నిషేధం ఎందుకు విధించలేకపోతున్నామని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కిరణ్ బేడీ చిరునవ్వుతో ప్రశంసాపూర్వకంగా చూస్తుండిపోయారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ యువతి కడుపులో 150 బతికున్న పాములు.. అవాక్కయిన వైద్యులు