Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రివాల్వర్ రాణి.. వరుడి తలకు గురిపెట్టింది.. స్కార్పియోలో కిడ్నాప్ చేసుకెళ్లింది..

కళ్యాణ మండపంలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సీన్ ఏ సినిమాలో ఉందో తెలియదు కానీ.. కాసేపట్లో వివాహం జరుగుతుందనే ఆనందంలో అందరూ కోలాహలంగా ఉన్న కల్యాణ మండపానికి ఓ స్కార్పియో వాహనంలో ఓ రివాల్వర్

Advertiesment
రివాల్వర్ రాణి.. వరుడి తలకు గురిపెట్టింది.. స్కార్పియోలో కిడ్నాప్ చేసుకెళ్లింది..
, బుధవారం, 17 మే 2017 (18:52 IST)
కళ్యాణ మండపంలో సినీ ఫక్కీలో ఓ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ సీన్ ఏ సినిమాలో ఉందో తెలియదు కానీ.. కాసేపట్లో వివాహం జరుగుతుందనే ఆనందంలో అందరూ కోలాహలంగా ఉన్న కల్యాణ మండపానికి ఓ స్కార్పియో వాహనంలో ఓ రివాల్వర్ పట్టుకుని దిగిన 25 ఏళ్ల యువతి డైరెక్టుగా మండపం పైకి ఎక్కి, వరుడి తలకు గురిపెట్టింది. దీంతో పెళ్లికొచ్చిన అతిథులంతా షాక్ అయ్యారు.
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగింది. వరుడి తలకు ఆ యువతి గురిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంటే..? వరుడు ముందు ఆమెను ప్రేమించి.. ఆపై మోసం చేసి మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించడమే. అందుకే ఈ పెళ్లిని జరగనివ్వనని.. తలకు గురిపెట్టి.. వరుడిని తనతో పాటు తీసుకెళ్లింది సదరు యువతి. ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా వాహనంలో వచ్చినట్లు బంధువులు తెలిపారు.
 
రివాల్వర్‌తో బెదిరించి వరుడిని తీసుకెళ్లిన యువతితో ప్రేమాయణం నిజమేనని.. వారిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారని వరుడు పనిచేసే ప్రాంతానికి చెందిన స్థానికులు అంటున్నారు. ఆపై తల్లిదండ్రుల ఒత్తిడితో వారు కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకునేందుకు ఆ యువకుడు సిద్ధపడినట్లు సమాచారం. కాగా, తన కుమారుడు పని చేస్తున్న ప్రాంతానికి ఇటీవల వెళ్లిన తనను ఇంటికి పిలవలేదని, ఓ గుడిలో కలసి, హోటల్‌లో భోజనం పెట్టించి వెనక్కు పంపాడని, అప్పుడే తనకు అనుమానాలు వచ్చాయని వరుడి తండ్రి రామ్హేత్ యాదవ్ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాజ్‌మహల్ వద్ద పాము... టూరిస్టులు పరుగో పరుగు.. నీళ్లు తాగడానికి వచ్చిందట...