Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముఖానికి మాస్క్.. హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి

Advertiesment
ముఖానికి మాస్క్.. హాస్టల్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి
, సోమవారం, 14 జనవరి 2019 (14:09 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఓ పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించి, హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ యూనివర్శిటీలో మైక్రోబయాలజీ విభాగంలో పరిశోధక విద్యార్థిగా సుకన్య పొడార్ (26) అనే యువతి చదువుతోంది. ఈమె ముఖానికి నల్ల మాస్క్ ధరించి హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గది తాళాలు పగులగొట్టి ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే, సుకన్య అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ పరిశోధక విద్యార్థిని ముఖానికి నల్ల మాస్క్ ధరించి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. పైగా, సుకన్య... పరిశోధన చేస్తూనే ఓ కాలేజీలో పార్ట్‌టైమ్ టీచర్‌గా పని చేస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కౌగిలింతల ఉద్యోగం.. రూ.లక్షల్లో ఆదాయం .. ఎలా?