Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని నరేంద్ర మోడీ ప్లాన్‌తో చైనా వణికిపోతోందట... పాకిస్థాన్ పరేషాన్.. ఎలా?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌కు చైనా వణికిపోతుంటే.. పాకిస్థాన్ పరేషాన్‌కు గురవుతోంద. ఇంతకీ మోడీ వేసిన ప్లాన్ ఏంటి అనే దానిపై ఆరాతీస్తే... 'ఒకే ఒక్క రూపాయి భారతదేశ ఆర్మీ శక్తిని

Advertiesment
Army welfare fund
, శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (12:56 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ ప్లాన్ వేశారు. ఈ ప్లాన్‌కు చైనా వణికిపోతుంటే.. పాకిస్థాన్ పరేషాన్‌కు గురవుతోంద. ఇంతకీ మోడీ వేసిన ప్లాన్ ఏంటి అనే దానిపై ఆరాతీస్తే... 'ఒకే ఒక్క రూపాయి భారతదేశ ఆర్మీ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రధాని మోడీ వేసిన సూపర్ ప్లాన్‌తో చైనా వణికి పోతుంది, పాకిస్థాన్ పరేషాన్ అవుతుంది. ప్రతి భారతీయుడు తలచుకుంటే భారత ఆర్మీ అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. దేశం కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించే ప్రతి భారతీయుడికీ ఓ అవకాశం ఇప్పుడు దొరికింది. 
 
ఇందుకోసం మనం చేయాల్సిందొక్కటే. రోజుకు ఒక్క రూపాయి చొప్పున లేదా మూడు నెలలకొక్కసారి వంద రూపాయిలను ఆర్మీ బ్యాంక్ ఖాతాలో వేస్తే జమ చేస్తే చాలు. ఆ నేరుగా భారతీయ సేనల కోసం ఉపయోగిస్తారు. ఈ అకౌంట్‌లో 1 రూపాయి నుంచి  కోటిరూపాయిల వరకు జమచేయవచ్చు' అంటూ కేంద్రం పిలుపునిచ్చిందని ఓ ఆంగ్ల పత్రికలు వార్త ప్రచురించింది.
 
మీరు మనకోసం, మనదేశం కోసం, నాకోసం, నీకోసం, మన అందరి కోసం ఒక్క రూపాయిని వెచ్చిద్దాం. ఇప్పటికే దేశ, విదేశాలలో ఉన్న భారతీయులు దీనిపై స్పందించి అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా 80 లక్షల రూపాయిలను అకౌంట్‌లో వేశారు. భారత ఆర్మీకి అండగా నిలబడదాం అనుకున్నవారు కింద ఇచ్చిన అకౌంట్‌లో డబ్బును జమచేయవచ్చు. ఈ డబ్బు డైరెక్ట్‌గా ఇండియన్ ఆర్మీకి చేరుతుంది. అయితే, ఈ వివరాలు ఖచ్చితమైనవో కాదో ఓ సారి నిర్ధారించుకోవాల్సి ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో అతివేగంగా ఇంటర్నెట్ అందించే ఆరు సంస్థలేంటి?