Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉర్జీత్ పటేల్ తలతిక్క పనులు... దొంగనోట్లు డిపాజిట్ అవుతున్నాయ్... బ్యాంకుల సమాఖ్య సంచలనం

నోట్ల రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు కనబడుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తలతిక్క పనుల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనీ, ఆర్థిక పరిజ్ఞానం లేని ఉర్జిత్ నిర్ణయం వల్ల దేశంలో 50 మంది ప్రజలతో పాటు 11 మంది బ్యాంకు సిబ్బంది మృత్యువాత

ఉర్జీత్ పటేల్ తలతిక్క పనులు... దొంగనోట్లు డిపాజిట్ అవుతున్నాయ్... బ్యాంకుల సమాఖ్య సంచలనం
, సోమవారం, 21 నవంబరు 2016 (20:21 IST)
నోట్ల రద్దు వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్లు కనబడుతోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ తలతిక్క పనుల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనీ, ఆర్థిక పరిజ్ఞానం లేని ఉర్జిత్ నిర్ణయం వల్ల దేశంలో 50 మంది ప్రజలతో పాటు 11 మంది బ్యాంకు సిబ్బంది మృత్యువాత పడ్డారని ఆల్ ఇండియా బ్యాంకుల సమాఖ్య ఉపాధ్యక్షులు ఫ్రాంక్ ధ్వజమెత్తారు. వీటన్నిటికీ బాధ్యత వహిస్తూ ఉర్జిత్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... దేశంలో 10 లక్షల కోట్ల పెట్టుబడి ఉన్న సహకార బ్యాంకులను పక్కన పెట్టడం దారుణం అన్నారు. ఆర్బీఐ 2 వేల నోట్లకు బదులు రూ. 100 నోట్లు ముద్రించి ఉంటే బాగుండేదనీ, చెడిపోయిన రూ.100 నోట్లను మార్కెట్లోకి వదలుతూ బ్యాంకు సిబ్బంది ఆరోగ్యంతోనే కాక ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. 
 
నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బందిపై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. ఈ ఒత్తిడి కారణంగా దొంగనోట్లు కూడా బ్యాంకుల్లో డిపాజిట్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిజ్ఞానం లేని ఉర్జిత్ ప్రధాని, ఆర్థిక మంత్రిని తప్పుదారి పట్టించారనీ, నోట్లు రద్దు చేసిన దేశాల వైఫల్యాలను పరిగణనలోకి తీసుకోకుండా రద్దును ప్రకటించి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టారన్నారు. చేతిపై ఇంకు వేయడం వంటి తలతిక్క పనులతో ప్రజల్లో అయోమయం సృష్టించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రెస్ ఇన్ఫ‌ర్మేష‌న్ బ్యూరో ఏపీ తొలి డైరెక్ట‌ర్‌గా తుమ్మ‌ విజయ్‌ కుమార్ రెడ్డి