Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి అనగానేమి? మొత్తం మోదీనే చేశాడంటున్న అమర్త్యసేన్

నేటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు ఏ విషయాన్నీ నిర్ణయించే పరిస్థితుల్లో లేదని, అన్ని నిర్ణయాలూ ప్రధాని మోదీనే తీసుకుంటున్నారని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఆరోపించారు. దీంతో కేంద్ర బ్యాంక్ స్వయంప్రతిపత్

ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి అనగానేమి? మొత్తం మోదీనే చేశాడంటున్న అమర్త్యసేన్
హైదరాబాద్ , బుధవారం, 11 జనవరి 2017 (06:07 IST)
నేటి పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు ఏ విషయాన్నీ నిర్ణయించే పరిస్థితుల్లో లేదని, అన్ని నిర్ణయాలూ ప్రధాని మోదీనే తీసుకుంటున్నారని నోబెల్ గ్రహీత అమర్త్య సేన్ ఆరోపించారు. దీంతో కేంద్ర బ్యాంక్ స్వయంప్రతిపత్తే ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. ఆర్బీఐ మాజీ గవర్నర్లు వైవీ రెడ్డి, బిమల్ జలాన్ తర్వాత ఆర్బీఐ చేతకానితనాన్ని ప్రశ్నిస్తూ  అమర్త్య సేన్ ప్రధాని మోదీపైకి వేలు చూపించడం గమనార్హం. 
 
ప్రధాని మోదీ నల్లధనాన్ని నిర్మూలించడానికి ఏదో ఒకటి చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. సంశయ లబ్ధిని పొందడాన్ని మోదీ కొనసాగిస్తారు. విషాదకరమైన విషయం ఏమటంటే సంపన్నులు ఇప్పుడు బాధలకు గురవుతున్నారని దేశంలో సాగుతున్న ప్రచారంతో పేదప్రజలకు నచ్చచెబుతున్న పరిస్థితి అలుముకుందిని అమర్త్య సేన్ చెప్పారు. ఆర్బీఐ ఈ స్థితిలో దేన్నయినా నిర్ణయించే దశలో ఉందని తానయితే భావించడం లేదని, పెద్ద నోట్ల రద్దు పూర్తిగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయమేనని సేన్ నొక్కి చెప్పారు. 
 
రఘురామ్ రాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆర్బీఐ తగినంత స్వతంత్రతతో వ్యవహరించేదని, ఐజీ పటేల్, మన్మోహన్ సింగ్ వంటి ఉద్దండులు దాన్ని సమర్థవంతంగా నిర్వహించారని అమర్త్య సేన్ అభిప్రాయ పడ్డారు. దేశంలో 86 శాతం కరెన్సీని తొక్కి పెట్టి 6 శాతంగా ఉన్న నల్లధనాన్ని  నిర్మూలించవచ్చనే నిర్ణయానికి మోదీ ప్రభుత్వం ఎలా రాగలిగిందని సేన్ ప్రశ్నించారు. 
 
భారత్‌లో నకిలీ నగదు అనేది ఎన్నడూ ఒక సమస్యగా లేదని పెద్దనోట్ల రద్దు ద్వారా నకిలీ కరె్న్సీని నిర్మూలించడానికి అదెన్నడూ పెద్ద సమస్యగా లేదన్నారు. పెద్దనోట్ల రద్దు తప్పుకుండా చిన్న వ్యక్తుల బృందమే తీసుకుందని చెప్పారు. భారత్ సమాఖ్య రాష్ట్ర్రం కాబట్టి ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సి ఉండెనని సేన్ పేర్కొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీలో నోటిదూల ఎంపీ 'సాక్షి'కి ఎన్నికల కమిషన్ నోటీసు