Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భువనేశ్వర్ దారుణం : నిఫ్ట్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. సెక్యూరిటీ గార్డు హస్తం!

ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో దారుణం జరిగింది. భువనేశ్వర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కి చెందిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది.

Advertiesment
Rape
, ఆదివారం, 7 ఆగస్టు 2016 (16:54 IST)
ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లో దారుణం జరిగింది. భువనేశ్వర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కి చెందిన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి దాటాక రైల్వే స్టేషన్ నుంచి నిఫ్ట్‌లోని హాస్టల్‌కు వస్తున్న విద్యార్థినిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కిట్ (కళింగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌లోకి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. 
 
ఈ విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థిని తనను రక్షించమని కేకలు వేస్తున్నా అక్కడే ఉన్న సెక్యూటిరీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపించారు. అంతేకాక ఈ ఘటనలో ఓ సెక్యూరిటీ గార్డు హస్తం కూడా ఉందని ఆరోపించారు.
 
అయితే, ఈ విషయం తెలుసుకున్న నిఫ్ట్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనతో రంగప్రవేశం చేసిన పోలీసులు లాఠీలకు పనిచెప్పి విద్యార్థులను చెదరగొట్టారు. రేప్ వార్తలను పోలీసులు ఖండించారు. అటువంటిది జరిగినట్టు తమకు సమాచారమేదీ లేదన్నారు. కాగా, బాధిత విద్యార్థిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 
 
మరోవైపు రేప్ ఆరోపణలను కిట్ యాజమాన్యం ఖండించింది. తమ క్యాంపస్‌లో అటువంటి ఘటనేమీ జరగలేదని, నిఫ్ట్‌లో అది జరిగి ఉంటుందని కిట్ స్టూడెంట్ సర్వీస్ డైరెక్టర్ డాక్టర్ సుచేత పేర్కొన్నారు. అయితే విద్యార్థుల వాదన మాత్రం మరోలా ఉంది. ఏం జరిగిందో చెప్పకుండా విద్యార్థిని భయపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతుడు.. మినష్ భగీరథలో ప్రధాని నరేంద్ర మోడీ