Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వాతి హత్య: రామ్ కుమారే నిందితుడా..? స్వాతి తండ్రికి లింకుందా..? చెన్నైలో చర్చ

చెన్నై టెక్కీ స్వాతి కేసులో అసలైన నిందితుడు రామ్ కుమారేనని మొన్నటివరకు అందరూ అనుకున్నారు. అయితే.. రామ్ కుమార్ రివర్సయ్యాడు. తనకు స్వాతి అంటే ఎవరో తెలియదని, తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ప్లేటు మా

స్వాతి హత్య: రామ్ కుమారే నిందితుడా..? స్వాతి తండ్రికి లింకుందా..? చెన్నైలో చర్చ
, బుధవారం, 6 జులై 2016 (15:27 IST)
చెన్నై టెక్కీ స్వాతి హత్య కేసులో అసలైన నిందితుడు రామ్ కుమారేనని మొన్నటివరకు అందరూ అనుకున్నారు. అయితే.. రామ్ కుమార్ రివర్సయ్యాడు. తనకు స్వాతి అంటే ఎవరో తెలియదని, తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని ప్లేటు మార్చాడు. దీంతో పోలీసులు తలపట్టుకుని కూర్చున్నారు. రామ్ కుమార్ అరెస్టులో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించారని నిన్న హైకోర్టు అక్షింతలు వేసింది. 
 
రామ్ కుమార్‌ను స్వాతి హత్య కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని కోర్టులో ప్రవేశపెట్టక మునుపే నిందితుడని తేల్చేయడం ఏంటని కోర్టు ప్రశ్నించింది. అంతేగాకుండా రామ్ కుమార్ గొంతు కోసుకున్నట్లు గల ఫోటోను మీడియాకు పోలీసు శాఖ ఎందుకిచ్చిందని, రామ్ కుమార్ స్వాతి హత్య కేసులో నిందితుడని పోలీసులు హుటాహుటిన మీడియాకు చెప్పడంపై కోర్టు ఫైర్ అయ్యింది. 
 
స్వాతి కేసు విషయంలో నిందితుడు ఎవరో తేల్చే విషయంలో పోలీసులకు తొందరెందుకని హైకోర్టు మండిపడింది. తద్వారా పోలీసులు ఈ కేసులో రహస్యంగా ఉంచాల్సిన విషయాలను దాచలేకపోయారు. దీంతో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించారని న్యాయమూర్తులు తప్పుబట్టారు. రామ్ కుమార్ ఇచ్చిన వాంగ్మూలాలను ఎవరు బహిరంగంగా తెలియజేశారని హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. రామ్ కుమారే స్వాతి కేసులో హంతకుడని పోలీసులు ఎలా నిర్ణయిస్తారు. ఈ కేసులో రామ్ కుమార్‌ వెనక ఎవరూ లేరంటూ పోలీసులు ఎలా డిసైడయ్యారు.. అంటూ హైకోర్టు ప్రశ్నించింది. 
 
ఒకవైపు హైకోర్టు ఇలా ప్రశ్నించగా, మరోవైపు స్వాతి హత్య కేసులో ఆమె తండ్రి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు తలెత్తాయి. స్వాతి చనిపోయాక ఆమె తండ్రి అంతగా బాధపడినట్లు కనిపించలేదని.. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా తమిళ మీడియాలో కనిపించినట్లు తెలుస్తోంది. స్వాతి పట్ల పెద్దగా పట్టించుకునే వారు లేరని.. ఆమెకు తల్లి లేకపోవడంతో పెదనాన్న, బాబాయ్‌ల వద్ద పెరిగిందని.. వాళ్ల కుటుంబీకులతో తరచూ స్వాతికి గొడవలుండేవని ఇరుగుపొరుగు వారు విచారణలో వెల్లడించినట్లు కొత్త వాదన వినిపిస్తోంది. 
 
అంతేగాకుండా స్వాతి హత్య కేసుకు సంబంధించి.. ఆమె తరపు బంధువుల వద్ద కూడా పోలీసులు విచారణ జరిపితే నిజానిజాలు బయటికి వస్తాయని, రామ్ కుమారే హంతకుడని పోలీసులు నిర్ణయానికి రాకుండా ఈ కేసు వెనక ఎవరెవరున్నారో..? లోతుగా ఆరా తీయాలని డిమాండ్లు వస్తున్నాయి.
webdunia
 
మరోవైపు రామ్ కుమార్ అరెస్టుకు వెళ్లిన పోలీసులు ఆతడి సోదరి, తల్లిపట్ల అమానుషంగా ప్రవర్తించారని, మీడియా కూడా ఓవరాక్షన్ చేసిందని విమర్శలు వస్తున్నాయి. మహిళలను ఫోటోలు తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని రామ్ కుమార్ సోదరి కూడా ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యింది. తనకు చదువు విషయంలో ఎంతగానో సహకరించే అన్నయ్య (రామ్ కుమార్), ఐఏఎస్ కావాలనుకున్నాడని.. అలాంటి వ్యక్తి హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నామని చెప్పింది. 
 
ఇకపోతే స్వాతి హత్య కేసులో రోజుకో కొత్త విషయం పుట్టుకొస్తున్న తరుణంలో.. వెల్లువెత్తే పలు అనుమానాలకు సమాధానం దొరకాలంటే.. పోలీసు అధికారులు బహిరంగంగా మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, ప్రెస్ మీట్ పెట్టి స్వాతి కేసుకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాల్సిందేనని మీడియాతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్ తారలతో మజా కోసం రూ.18కోట్లు తగలబెట్టాడు.. కానీ వారు వచ్చారా?