భారత కొత్త రాష్ట్రపతి కోవింద్... చిత్తుగా ఓడిన మీరా కుమార్
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. దీంతో భారత 14వ రాష్ట్రపతిగా ఈనెల 25వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి పదవి కోసం జరి
భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థి రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. దీంతో భారత 14వ రాష్ట్రపతిగా ఈనెల 25వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి పదవి కోసం జరిగిన ఎన్నికల్లో రాంనాథ్ గోవింద్‌తో యూపీఏ కూటమి అభ్యర్థి తరపున మీరా కుమార్ పోటీపడ్డారు.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఓట్ల లెక్కింపు గురువారం జరుగగా, ఈ ఫలితాల్లో రాంనాథ్ కోవింద్ ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65శాతం ఓట్ల రాగా, మీరాకుమార్‌కు 34.35 శాట్లు మాత్రమే వచ్చాయి. కోవింద్‌కు వచ్చిన మొత్తం ఓట్ల విలువ 7,02,644కాగా, మీర్ కుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3,67,314గా ఉంది.
అయితే, ఏపీలో రాంనాథ్‌కు మొత్తం 27189 ఓట్లు రాగా, మీరా కుమార్‌కు ఒక్క ఓటు కూడా దక్కలేదు. అంటే కాంగ్రెస్‌కు మరోమారు ఘోర పరాభవం ఎదురైంది. కాగా, మొత్తం పోలైన వాటిలో 21 ఓట్లు చెల్లబాటు కాలేదు.
కాగా, ఎన్నికలకు ముందే రాంనాథ్ గెలుపు ఖాయమన్న విషయం తేలిపోయింది. ఉభయ సభల్లో ఉన్న ఎన్డీఏ పక్షాల అభ్యర్థులతో పాటు వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే కూడా ఎన్డీయేకే మద్దతు తెలపడంతో కోవింద్ రైసినాకు చేరుకోవడం ఖాయమన్న విషయం స్పష్టమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే కోవింద్ ఆధిక్యంలో దూసుకుపోయారు. మీరాకుమార్ ఆయనకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు.
రాంనాథ్ విజయంతో ఢిల్లీతోపాటు కాన్పూరులోని ఆయన నివాసం వద్ద సంబరాలు మిన్నంటాయి. బీజేపీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుకున్నారు. మరోవైపు వివిధ రాజకీయ పక్షాల నేతలు, అధికారులు, ప్రజాపతినిధులు రాంనాథ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కోవింద్‌కు మద్దతు ప్రకటించని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు శుభాకాంక్షలు తెలియజేశారు.