భారత 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్‌కు రాజ్యాభిషేకం
భారత 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పార్లమెంట్ సెంట్రల్ హా
భారత 14వ రాష్ట్రపతిగా రాంనాథ్ కోవింద్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో భారత ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అట్టహాసంగా జరిగింది.
భారత రాజ్యాంగ పరిరక్షణ చేస్తానని ఈ సందర్భంగా కొత్త రాష్ట్రపతి రాంనాథ్ అన్నారు. దేశ ప్రజలకు సేవ చేస్తానని కూడా ఆయన శపథం చేశారు. రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన రాంనాథ్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్ సీటుపై కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, ఉపరాష్ట్ర హామీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.
అంతకుముందు.. తొలుత రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళి అర్పించి ఆ తర్వాత తన సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఇద్దరూ కలిసి రాష్ట్రపతిభవన్‌లో ఉన్న కొన్ని రూమ్‌లను కలియతిరిగారు. రాష్ట్రపతిభవన్‌లో గత అయిదేళ్ల తాను తీసుకువచ్చిన మార్పులను ప్రణబ్ నూతన రాష్ట్రపతికి వివరించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రత్యేక వాహనంలో పార్లమెంట్‌కు చేరుకుని, ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.