Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామ మందిర నిర్మాణం కోసం రూ.1100 కోట్ల ఖర్చు

Advertiesment
ram temple

వరుణ్

, ఆదివారం, 21 జనవరి 2024 (16:26 IST)
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఘడియలు సమీపిస్తున్నాయి. 161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా (జీ ప్లస్‌ 2) చేపట్టిన మందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని తెలిపారు. తాత్కాలిక మందిరంలోని పాత రామ్ లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు.
 
51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని గురువారం ఆలయ గర్భగుడిలోకి చేర్చిన విషయం తెలిసిందే. మొత్తం మూడింటిలో మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన ప్రతిమను ఎంపిక చేశారు. మిగతా రెండింటినీ ఆలయంలో ఉంచుతామని గోవింద్‌ దేవ్‌ గిరి వెల్లడించారు. వాటిలో ఒకదాన్ని రాముడి వస్త్రాలు, ఆభరణాలకు సంబంధించి కొలతలు తీసుకునేందుకు ఉపయోగిస్తామన్నారు. 'పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉంది. 25- 30 అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదు. అందుకే పెద్ద మూర్తి అవసరమైంది' అని చెప్పారు.
 
'మూడింటిలో ఒకదాన్ని ఎంచుకోవడం చాలా కష్టమైంది. అవన్నీ అందంగా ఉన్నాయి. దివ్యమైన మెరుపుతో కూడిన పిల్లవాడి ముఖం, రాముడు ఆజానుబాహుడు కాబట్టి.. చేతులు పొడవుగా ఉండటం వంటి ప్రమాణాలను పాటించాయి. మేం ఎంపిక చేసిన ప్రతిమ శరీర పుష్టి, మంచి వ్యక్తిత్వం కనబడేలా చక్కగా కుదిరింది. పిల్లవాడి సున్నిత స్వభావం దాని అందాన్ని పెంచింది. ఆభరణాలను సున్నితంగా చెక్కారు' అని ట్రస్టు కోశాధికారి వివరించారు. విగ్రహాలను చెక్కేందుకు నాలుగైదు నెలలు పట్టిందని, అనంతరం ఒకరోజు వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
 
ప్రపంచ అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్‌కు చోటు 
 
ప్రపంచంలో అత్యుత్తమ రెస్టారెంట్లుగా పేరుగాచిన రెస్టారెంట్ జాబితాలో హైదరాబాద్ రెస్టారెంట్ చోటు దక్కింది. టాప్ 1000 రెస్టారెంట్లలో ఒకటిగా ఫలక్ నుమా ప్యాలెస్‌‍లోని 'ఆదా' రెస్టారెంట్ నిలిచింది. ఫ్రాన్స్‌కు చెందిన రెస్టారెంట్ గైడ్ అండ్ ర్యాంకింగ్ కంపెనీ 'లా లిస్టే' ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో మన భారతీయ నగరాలకు చెందిన రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం మన దేశంలో అత్యుత్తమ రెస్టారెంట్‌గా ఢిల్లీలోని 'ఇండియన్ యాక్సెంట్' నిలిచింది.
 
ఈ రెస్టారెంట్‌కు లా లిస్టే 95 పాయింట్లు ఇచ్చింది. ఆ తర్వాత 86 పాయింట్లతో బెంగళూరులోని కరావల్లి రెస్టారెంట్ రెండో స్థానంలో, 84 పాయింట్లతో హైదరాబాదీ 'ఆదా' మూడో స్థానంలో నిలిచాయి. హైదరాబాదీ వంటకాలకు అత్యంత ప్రసిద్ధి పొందిన రెస్టారెంట్‌గా ఆదా ఈ జాబితాలో చోటుసంపాదించుకుంది. అమెరికాకు చెందిన లే బెర్నార్డిన్ రెస్టారెంట్ సహా ప్రపంచంలోని మొత్తం ఏ రెస్టారెంట్లు 99.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచాయి.
 
'లా లిస్ట్' ప్రకారం ఇండియాలోని టాప్ 10 రెస్టారెంట్లు..
ఇండియన్ యాక్సెంట్ (న్యూఢిల్లీ), కరావల్లి (బెంగళూరు), ఆదా (ఫలక్ నుమా ప్యాలెస్, హైదరాబాద్), యౌచా (ముంబై), దమ్ పుస్త్ (న్యూఢిల్లీ), జమావర్ (లీలా ప్యాలెస్, బెంగళూరు), లే సర్క్యూ సిగ్నేచర్ (లీలా ప్యాలెస్, బెంగళూరు), మేగు (న్యూఢిల్లీ), బుఖారా (ఐటీసీ మౌర్య, న్యూఢిల్లీ), జియా (ముంబై)లు ఉన్నాయి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యను బీచ్‌కు తీసుకెళ్లి.. సముద్రపు నీటిలో ముంచి చంపేసిన భర్త.. ఎక్కడ?